ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆరోగ్య పరిరక్షణ - పి . కమలాకర్ రావు
October 4, 2020 • T. VEDANTA SURY • health tips

మనకు ఆరోగ్యం స్థిరంగా ఉండాలంటే ఏ జబ్బులు రాకుండా చూసుకోవడం ప్రథమ కర్తవ్యం . మన ఆరోగ్యం శరీరం లో ఉన్న బలం పై , ఆ తర్వాత వ్యాధి నిరోధక శక్తిపై ఆధార పది ఉంటుంది. త్రివిధం బలం అంటారు . 
1. సహజంగా పుట్టుకతో వచ్చేది. 
2. వయస్సు, ఋతువులను బట్టి బచ్చేది. 
3. ఆహార విహారాదుల వలన వచ్చేది. 
బాగున్న ఆరోగ్యం పాడై పోవడానికి కారణాలు అతిగా తినడం, లేక తినాల్సినంత తినక పోవడం , తినకూడనివి తినడం లేక తాగడం , విరుద్ధాహారాలు సేవించడం కోపాన్ని ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోలేక పోవడం . మానసిక చింతన , అసూయా ద్వేషాలు  మొదలైనవి. యెంత జాగ్రత్తగా వున్నా ఒక్కొక్క సారి వైరల్ వ్యాధుల వలన అనారోగ్యం వస్తే దానికి తగిన ఔషధ సేవనం సరియైన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ప్రస్తుత కర్తవ్యం