ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆరోగ్య -దీపావళి ..: --డా.కె .ఎల్వీ --హనంకొండ .
November 13, 2020 • T. VEDANTA SURY • Poem

కరోనా దీపావళి 
కాస్త --
కఠినంగానే ,
ఉంటుంది !

వినడానికి --
ఆచరించడానికి ,
కాస్త ----
ఇబ్బందిగానే -
ఉంటుంది ..!

ఎవరో చెబితే ,
చూద్దాం ..  చేద్దాం,
ఆలోచిద్దాం,
అనే భావన వద్దు ,
మనకై మనమే 
ఆచరించడం ముద్దు !

టపాకాయలూ -
సిసింద్రీలు -చిచ్చుబుడ్లు ,
మతాబులూ ...
కాకారపువ్వొత్తులూ ..,
కాలిస్తేనే 
దీపావళి అనుకోవద్దు !

పరిస్తితులను బట్టి ...
సంప్రదాయాలను 
సంస్కృతినీ 
కాసేపుపక్కనపెట్టి 
ఆరోగ్య దీపావళి కోసం 
అందరం 
కృషి చేయాలి ....!

దీపాల వెలుగులో 
అందరి దరహాసం ..
ఆనందపు-
హరివిల్లు కావాలి...!!