ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆలోచనలు; యామిజాల జగదీశ్
August 30, 2020 • T. VEDANTA SURY • Story

మిట్ట మధ్యాహ్నం. ఎండ దంచుతోంది. ఎక్కడెక్కడో నడుచుకుంటూ వచ్చిన ఓ మనిషి నీడ కోసం  ఓ చెట్టుకిందకు చేరి ఆదమరిచి నిద్రపోయాడు.
కాస్సేపటికి ఆ దారమ్మట ఓ కట్టెల వ్యాపారి వచ్చి అతనిని చూశాడు.
అతను బహుశా ఎంతో కష్టించి ఉంటాడు. కనుకే ఇంతటి ఎండలోనూ ఇంతలా నిద్రపోతున్నాడు అని అనుకుంటూ కట్టెల వ్యాపారి మెల్లగా నడుచుకుంటూ పోతున్నాడు.
ఆ తర్వాత ఓ దొంగ అటువైపు వచ్చాడు.
రాత్రంతా మేల్కొని దొంగతనాలు చేసిన అలుపులో ఇంత ఎండున్నా ఒళ్ళు తెలియక పడుకున్నాడేమో అనుకున్నాడు చెట్టుకింద పడుకున్నతనిని చూసి. దొంగ కూడా ఇలా అనుకుంటు ముందుకు వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు. అతనొక తాగుబోతు. ఈ ఉదయం తప్పతాగి ఉంటాడు. అందుకే  ఇలా స్పృహతప్పి పడుకున్నాడు కాబోలు అనుకుని ఆ తాగుబోతు ముందుకు వెళ్ళిపోయాడు.
అనంతరం ఓ సాధువు అటువైపు వచ్చాడు.
ఈ మిట్టమధ్యాహ్నపు ఎండలో ఇలా నిద్రపోతున్నాడంటే ఇతను బహుశా అన్నింటినీ త్యజించిన సాధువు అయి ఉంటాడు. ఇంకెవరు ఇలా నిద్రపోగలరు అనుకుని సాధువు ముందుకు వెళ్ళిపోయాడు.
ఈ కథ నీతి ఏమిటంటే, మనమెలాగో మన ఆలోచనలు అలానే ఉంటాయి.