ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆల్ _ఇన్ _వన్ ... --కె .ఎల్వీ
October 29, 2020 • T. VEDANTA SURY • Poem

స్మార్టు ఫోన్లు 
సముద్ర తరంగా లై 
ఎగసిపడుతున్నవేళ 
లేనిదంటూ లేని ,
ఆ ..మాయా వి 
ఒక చిన్న ...
కంప్యూటరై 
మానవ జీవితంలో ,
ఆహరం తరువాత 
అతి ముఖ్య _
అవసరం ,
 అయిపొయింది !

కూలివాడి దగ్గరనుంచి 
కలెక్టర్ల వరకూ ...
పాలవాడి దగ్గరనుంచి 
ప్రజానాయకుడి వరకూ 
మొబైల్ ఒక 
ముఖ్య అవసర _
వస్తువయింది ....!

మొబైల్ ...
మనముంగిటవాలి ,
రిష్టువాచీ _గోడ గడియారం 
అవసరం లేకుండా చేసింది ,

కెమెరాతో ...
పనిలేకుండా చేసింది ,

కాలికులేటర్ 
తానై కూచుంది ,

తానే ...
అలారమై మ్రొగింది ,

నేనుండగా ....
క్యాలెండరుతో 
పని ఏమి అంది !

నిఘంటువును నేనే ,
సకల విజ్ఞాన సర్వస్వము 
నేనే ..అంటుంది ,

టెలిగ్రామ్ కు ట్రంకాల్ కు 
చెల్లు చీటీ పలికించింది ,

ప్రేమలేఖలకు _
గ్రీటింగ్ కార్డులకు ..
బై ..బై ..చెప్పించింది 

ప్రసార _ ప్రచార
 మాధ్యమంగా ,
ప్రజల చేతికి ...
ముఖ్య అలంకా రమైంది !

గ్రూపులు కట్టడం 
నేర్పిందిదే ...
గౄపుల్లో 
రకరకాల ట్రూపులు 
విభజించింది ఇదే !

కలమూ ఇదే ...
కుంచే ఇదే ...
దారి చూపించే ,
దిక్చూచికూడా ఇదే !

మారువేషాలు 
వేయించేదీ ఇదే ,
మాట్లాడితే ...
అక్షరంగా 
రూపాంతరం చేసేదీ 
ఇదే ....!

అందుకే 
ఆదునిక మానవుడికి 
మొబైల్ ఒక 
నిత్య అవసరం అయింది !
ముఖ్య పనిముట్టు _
జాబితాలో చేరింది !!