ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే.--చిటికెన కిరణ్ కుమార్--Cell.9490 84 1284
September 10, 2020 • T. VEDANTA SURY • News

మనిషి జీవితం  చాలా విలువైనది...ఆ నిండు ప్రాణం ప్రపంచానికి ఏ కొత్తదనాన్ని సృష్టిస్తుందో అందుకే సాధ్యమైనంతవరకు ఆత్మహత్యలను నిరోదించుదాం  మానవ మనుగడకు బాటలు వేద్దాం. 
సెప్టెంబర్ 10 - ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం (WSPD)
ఆత్మహత్య కేసులను నివారించడానికి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10 న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని (WSPD) జరుపుకుంటారు. ఈ రోజును ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (IASP) నిర్వహిస్తుంది. మరియు ఈ రోజు WHO సహ-స్పాన్సర్ చేసింది.
ఆత్మహత్య అనేకంటే ఇచ్ఛా మరణం అనటమే సరైనది. అది బలవన్మరణం కాదు. ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. ఇప్పుడు ఆ సెక్షన్ రద్దుకోసం భారత లా కమిషన్ సిఫారసు చేసింది. ఆత్మహత్యాయత్నం నేరం కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. 'తీవ్రమైన నిరాశ నిస్పృహలతోనే ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు. వారికి కావలసింది సహాయం కానీ శిక్ష కాదు' అని స్పష్టం చేసింది. ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్‌ను తొలగించాలని పార్లమెంటుకు సిఫార్సు చేసింది. భారతదేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లునేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. హిందూ ధర్మ శాస్త్రాలు ఆత్మ హత్యను మహాపాతకంగా వర్ణిస్తాయి. సార్క్‌దేశాలైన భారత్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల్లో ప్రతీ లక్ష మందిలో 8 నుండి 50 మంది దాకా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 45వ స్థానంలో ఉండగా, శ్రీలంక 12వ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం జరుపుకుంటారు. 
       ఇలాంటివన్నీ దాదాపు ప్రతిరోజూ పత్రికల్లో, టీవీ చానెళ్లలో ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉన్నాం. అప్పటి వరకూ మనతోనే ఉండి, మనింటి పక్కనే ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలుసుకుని అవాక్కవుతాం. తన ప్రాబ్లం ఏంటో ఒక్కసారి కూడా చెప్పలేదు. చెప్తే ఇంత జరిగేదికాదుగదా అంటూ నిట్టూర్పులు విడుస్తాం. అయ్మో పాపం అనడం కంటే ఏమీ చేయలేమా అని ఓసారి ఆలోచిస్తే …ఆత్మహత్యలను ఆపేందుకు పరిష్కారం దొరుకుతుంది. అందుకోసమే ఆత్మహత్యల నివారణకూ ఓ రోజు ఉంది. రోజురోజుకీ ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (IASP), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంయుక్తంగా 2003 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ఆత్మహత్యల నివారణ రోజుగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కలిసి పని చేద్దాంఆత్మహత్యలు నివారిద్దాం (Working Together to Prevent Suicide) అనే లక్షంతో సామాజిక చైతన్యం కల్పించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపట్టడానికి పిలుపునిచ్చింది. ఆత్మహత్య చేసుకోవడం పిరికి చర్య, మహా పాపం అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే విపరీతమైన ఆలోచన చేయడాన్ని వైద్య పరిభాషలో పారాసూసైడ్ అంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, ప్రయత్నం రెండూ కూడా తీవ్రమైనవిగా పరిగణించాలి. సైకోటిక్ రియాక్షన్ ఫలితంగా కూడా ఇలాంటి ఆలోచనలు ఏర్పడతాయి. ఎప్పుడైతే నిస్సహాయత ఆవరించిందో, భవిష్యత్తు చీకటిగా కనిపిస్తుంది. మనోవ్యాధికి లోనవుతారు. ఇలాంటి వారు ఆత్మహత్యే శరణ్యమనుకుంటారు. బలవన్మరణానికి చేసే వివిధ ప్రయత్నాలన్నీ మానసిక రుగ్మతల కిందకు వస్తాయి. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారికి తక్షణమే మానసిక వైద్యుని పర్యవేక్షణ అవసరం.
చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆత్మహత్యకు పాల్పడేవారి సంఖ్యను పరిశీలిస్తే …చాలా చిన్న చిన్న కారణాల వల్లే చనిపోతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఎవరికైనా తన బాధ చెప్పుకున్నప్పుడు ..విన్నవాళ్లు వెంటనే ఆ…ఇదీ ఒక బాధేనా, తర్వాత చూద్దాంలే అనే నిర్లక్షపు సమాధానంతో వీరు తెగ మనసు పాడుచేసుకుంటారు. నన్నెవరూ పట్టించుకోవడం లేదనే భావనతో తమను తాము అంతం చేసుకుంటున్నారట. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారో, వారు తమ సమస్యను పరిష్కరించుకునే మార్గాన్ని కూడా వెతకరు.