ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆ రాత్రి: - జగదీశ్ యామిజాల
November 16, 2020 • T. VEDANTA SURY • News

ఇది చలంగారి కథా శీర్షిక. ఆయన రాసిన కథలలో ఇది చివరి కథ. చలం గారు అరుణాచలానికి  వెళ్ళిన తర్వాత తన మిత్రులైన తొయ్యేటి శివంగారి కోసం రాసినది. శివంగారికి ఇచ్చిన మాట చెల్లింపుకోసం రాసిన కథ. ఇందులో కథ కన్నా కథనం బాగుందన్నారు వావిలాల సుబ్బారావుగారు. ఈ కథకు ఎంత ప్రాముఖ్యం ఉన్నదో అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యంతో పాఠకుణ్ణి ఆకర్షించే వ్యాఖ్యానాలవల్ల మొత్తంమీద గొప్ప విలువ కలిగిందని వావిలాల గారి అభిప్రాయం. వావిలాలగారు చలంగారి కథానికా సాహిత్యం - అనుశీలనంపై పరిశోధన చేశారు. ఈ పుస్తకాన్ని అడిగిన వెంటనే కొనకండంటూ పంపారు ఆయన. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య కథ. చలంగారికి ప్రకృతి వర్ణనలంటే ఇష్టం. కానీ ఈ కథలో ఆ అంశం ఎక్కువ చోటు చేసుకోలేదు. పాత్రల ప్రపత్తే తప్ప ప్రకృతి సౌందర్యంమీద మనస్సు పోనీక రాసిన కథ ఇది. ఈ కథ రచనా కాలం 1951.