ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఇక్కడో ...!అక్కడో ....:-----డా.కె .ఎల్వీ .హనంకొండ .
November 16, 2020 • T. VEDANTA SURY • Poem

నేనంటే -
మాతాతకు ఇష్టం !

తాతంటే ..
నాకెంతో ఇష్టం !

అమ్మమ్మంటే ,
మరీ ..మరీ ..ఇష్టం !

అమెరికాలో ఉన్న 
మా ..మామకు 
నేనంటే చాల ఇష్టం !

నాకూ ..మామంటే ,
బోలెడంత ఇష్టం ..!

పుట్టింది భాగ్యనగరం 
అయినా ....
పెరుగుతోంది 
ఓరుగల్లులోనే 
అమ్మమ్మ -తాత ,
సంరక్షణలోనే ...!

వృత్తిపరంగా 
అమ్మ పనిచేసేది 
వరంగల్లులో ...
అందుకే ...
నేనూ ..ఇక్కడేమరి !

అమ్మకు 
హైదరాబాదుకు 
బదిలీ అయితే ...
నా బడికూడా ,
హైదరాబాదు లోనే ,
అమ్మ ఎక్కడుంటే 
నేనుకూడా అక్కడే !

మరి ---
అమ్మమ్మ --తాతా ...
ఇక్కడో ....
అక్కడో .....!!
-------------------------------
                              
ఫోటోలో: తాత తో....బేబీ.ఆన్షి.నల్లి.