ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఇలానే ....: -------డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ
November 19, 2020 • T. VEDANTA SURY • Poem

తాత పాత సినిమా 
పాటల కూనిరాగాలు 
తీస్తుంటారా ....
నేను ఉన్నది ఉన్నట్టు 
పాడి వినిపించేస్తాను 
తాతకు ముద్దొచ్చేసి 
' పండూ ..' అంటూ 
దగ్గరకి తీసుకుని 
హగ్ ..చెసేసుకుంటారు !

రేడియోలో ...
పాటలు వినడం 
తాతకు ఎంతో ఇష్టం ,
హుషారు పాటలకు 
నేను డాన్సు చేస్తుంటే 
చూసి మురిసిపోతారు 
మా  ..తాత ...!

టి .వి.లో డాన్సులు చూసి 
అభినయం చేస్తానా ...
చూసి 'బుడ్డోడా 'అని 
తెగ సంతోష పడిపోతారు 
మా ..డాడీ ...!

అమ్మమ్మ పాడే 
భక్తిపాటలు 
అలాగే అనుకరిస్తానా 
అమ్మమ్మ ఆనందం 
ఆకాశాన్ని అంటుతుంది !

అమ్మ వేయించే 
విచిత్ర వేషాలను చూసి 
అనందంగా అమ్మ ...
' గ్రేసీ ..' అని 
ముద్దుపెట్టుకుంటుంటే 
చెప్పలేని ...
సంతోషం కలుగుతుంది !

ఈజీవితం ...
ఇలాగే సాగిపోవాలని 
ఆశపుడుతుంది ....!!
--------------------
   *పండు 
*బుడ్డోడు 
*గ్రేసీ ----ఆన్షి *కి ముద్దు పేర్లు .

ఫోటోలో....బేబీ ఆన్షి.నల్లి.