ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఇవాళ తృప్తిగా గడిచింది, గ్రహణ సమయంలో మా పిల్లలకు చక్కగా విష్ణుసహస్రనామ స్తోత్రం నేర్పించాను, దానికి తోడు ఆదిత్య హృదయం చేసుకున్నారు, మా అబ్బాయి, మా వారితో దాదాపు సమానంగా గాయత్రీ మంత్ర జపం చేసుకుని మొత్తం గ్రహణ సమయం అంతా దైవ ధ్యానం లోనే గడిపి అది కూడా పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా మధ్యాహ్నం మూడు గంటల వరకూ కుదురుగా ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కనీసం రెండు మూడు గంటల పాటు నోరు కట్టుకుని కూర్చోడానికి ఏవేవో వంకలు చెప్పే పిల్లలు ఉన్న ఈ కాలంలో తల్లీదండ్రుల నమ్మకాలకు ప్రాధాన్యతనిచ్చి, వారి పద్ధతులను ఆచరించటానికి ఇష్టంగా ఉపక్రమించి శ్రద్ధగా నేర్చుకునే పిల్లలు, తమ ఇళ్లకు వెలుగులు. మన నమ్మకాలగురించి జిజ్ఞాస కలిగి ఉన్న పిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఏమంటారు మిత్రులూ?-- నాగ జ్యోతి రమణ సుసర్ల
June 22, 2020 • T. VEDANTA SURY • News