ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఈతరం--- యామిజాల జగదీశ్
October 12, 2020 • T. VEDANTA SURY • Poem

యువతా!
ఓ యువతా!
కొత్తొక వింత 
పాతొక రోత అనే మాటలనుంచి
ఇవతలకు రా...
ముడతల అనుభవ మాటలు
బంగారుబాటకు తోడ్పడే సద్దిమూటలు!!

జననమరణాల మధ్య ఉండే
ప్రపంచాన్నినీ సొంతం చేసుకోవడంలో
చైతన్యవంతుడవడం ముఖ్యం


నీ కనులను తెరిపించే
సంచరించే 
సూర్యుడికి అప్పగించి
అడుగులేయ్

కళ్ళముందు జరిగే
నేరాలూ 
ఘోరాలతో
రెక్కలు తెగిన పక్షయిపోకు
అహంకారంతో
విర్రవీగే వారికి వంతపాడక
నీకంటూ
నీదంటూ ఓ మార్గాన్నెంచుకో

ప్రేమ
కామం
కోపం
తాపం
వంటివన్నీ 
నీ విజయానికి 
స్పీడ్ బ్రేకర్లు

దావానలంలా వ్యాపించే
కుట్రలూ 
కుతంత్రాల వలకు చిక్కకు
వాటి అలలు నిన్ను ముంచేస్తాయి

చైతన్యంతో
తొలి అడుగెయ్యి
యువతా....
ఈ ప్రపంచాన్ని
మేల్కొల్పు

మిత్రులతో కూడిన ప్రపంచాన్నీ
కులమతాలకతీతమైన సమాజాన్నీ
చూడు

రేపటి ఉదయం
సూర్యుడికి మాత్రమే కాదు
యువతా, నీకూనూ
తెలుసుకో జీవితసత్యం
లక్ష్యసాధనలో 
తడబడిపోకుండా
గమ్యం చేరుకో
నీదంటూ ఓ ముద్ర వేయి
అప్పటివరకూ 
ఆరాటపోరాటాలు తప్పవు
అంతేతప్ప అరిగి తరిగిపోకు
అప్పుడే విజయం తథ్యం!!