ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఈ రోజు కాళోజీ జన్మదినం.ప్రజాకవికి జోహార్లు.: రామ్మోహన్ రావు తుమ్మూరి
September 9, 2020 • T. VEDANTA SURY • News

కాకతాళీయంగా నాగరాజు రామస్వామి గారి జన్మదినం ఈ రోజే.ముందుగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.రామస్వామి గారిది మా ఊరు కావడం కంటే వారితో నాకు సాన్నిహిత్యం ఎక్కువ ఉండటం విశేషం.రామస్వామి గారి తండ్రి నాగరాజు తిరుమలయ్య గారు గొప్ప ఆయుర్వేద వైద్యులు.మా బాపుకు మంచి మిత్రులు కూడా.రామస్వామి గారు ముందు బి.ఎస్సీ.చదివారు కరీంనగర్ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాలలో.అప్పుడు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కళాశాల ప్రిన్సిపాలుగా ఉన్నారు.వారి శిష్యరికం అప్పటికే వారికున్న తెలుగు భాషాభిమానాన్ని ద్విగుణీకృతం చేసింది.
పట్టభద్రులు కాగానే కొన్ని నెలలపాటు ఎలగందుల పెద్దబళ్లోఉపాధ్యాయునిగా,ఆ తరువాత కొంత కాలం బ్లాక్ డెవలపర్ మెంట్ ఆఫీసరుగా చేశారు.ఈ కాలంలోనే వృత్యంతరశిక్షణలో భాగంగా ఆరునెలల పాటు శాంతినికేతన్ లో ఉన్నారు.అలా విశ్వకవి ప్రభావం ఆయనపై పడింది.ఆ తరువాత ఇంజనీరింగు చదివి ఎలెక్ట్రికల్ ఇంజనీయరుగా పాల్వంచలో కొంతకాలం,ఆదిలాబాదు జిల్లా ిర్పూర్ కాగజ్ నగర్ లోని సర్సిల్కు మిల్లులో కొంతకాలం పనిచేసి ఆ అనుభవంతో నైజీరియా వెళ్లారు.అలా నలభైయేళ్లప్రాయంలో విదేశాలకు వెళ్లి పాతిక సంవత్సరాలు ఘనామొదలైన కొన్ని చోట్ల పనిచేసి అప్పుడు స్వదేశం వచ్చారు.మొదటినుండే ఇటు తెలుగు సాహిత్యం తోనే అటు ఆంగ్ల సాహిత్యంతోనూ గాఢమైన పరిచయమున్నా ఆయన లోని కవి విజృంభించింది మాత్రం ఉద్యోగపర్వానంతరమే.తొలి పుస్తకం స్వీయకవితలను ఓనమాలు గా విడుదలచేశారు. అనువాద కవితలు కొన్ని సంకలించి అనుధ్వనిగా వెలువరించారు.అంతే ఇక ఆ తరువాత ఒకదాని వెనుక ఒకటి ఇటు స్వీయ కవితలు,అటు అనువాదకవితలు దాదాపు పది పన్నెండు వెలువరించారు.జాన్ కీట్స్ కవిత్వాన్ని ఈ పుడమి కవిత్వం ఆగదు పేర వెలువరించారు.అల
హే రవీంద్రున గీతాంజలిని రవీంద్ర గీతగా,ప్రఖ్యాత మెక్సికన్ నోబుల్ బహుమతి గ్రహీత ఆక్టేవియో పాజ్ సన్ స్టోన్ ను సూర్యశిలగా అనువదించారు.ఇవి కాక దేశవిదేశీయ ప్రసిద్ధ కవిత్వాలను.అనుస్వనం,అనుస్వరం,పురివిప్పిన పొరుగు స్వరం పేర్లతో అనువాద కవిత్వాన్ని తెలుగు వారికి అందించారు.దీనితో పాటే స్వీయ కవిత్వం గూటికి చేరిన పాట,ఎదపదనిసలు, విచ్చుకున్న అక్షరం పేర్లతో వెలువరించారు.ప్రపంచ సాహిత్య మీద ఎనలేని పట్టు గలిగిన వాడిరేవు చినవీరభద్రుడు గారు వీరి సూర్యశిలకు ముందు మాటరాయటమే గాక ఇంతటి విశిష్ట కవి రెండు తెలుగు రాష్ట్రాలలో అరుదు అని కూడా ప్రకటించారు.ఇటీవలి దశాబ్ద కాలం కవిత్వం సామాజిక మాధ్యమాలనుండి వెలువడి అనేక మంది పాఠకుల దృష్టిని చేరిన సంగతి అందరికీ విదితమే.ఈ అంతర్జాల సాహితీ క్షేత్రంలో కూడా నాగరాజు రామస్వామిగారు వారి స్వీయ,అనువాద కవితలతో అనేకమంది సాహితీ ప్రియులను అలరిస్తున్నారు. అశీతి దాటినా అలసటెరుగని ఈ సాహితీ కృషీవలుడు అనువాదంలో తన అనుభూతులను ఒక పుస్తకంగా అలాగే తమిళపాశురాలనువకల్యాణ గోదగా వెలువరించారు.వీటికి తోడుగా కొన్ని తెలుగు నుండి ఆంగ్లంలోకి అనుసృజించిన వాటిని
మ్యూజింగ్స్ పేరిట,అలాగే దీర్ఘాశి విజయకుమార్ గారి తెలుగు వచ నకవిత్వలసంపుటి మహాశూన్యంను గ్రేట్ వాయిస్ గా ఆంగ్లంలోకి అనువదించిన ప్రచురించారు.ఇలాంటి కవి మన తెలుగు దేశంలో కాకుండా ఇంకా ఎక్కడైనా పుట్టి ఉంటే విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ఇచ్చి గౌరవించేవి.అలాంటి కవిని ఇటీవల వెలువడిన తెలంగాణ సాహిత్య అకాడమీ వెలువరించిన పరంపరలో విస్మరించడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది.వారి దృష్టిలోనికి ఈ కవి ఎందుకు రాలేదో వారి విజ్ఞతతో వదిలేసి మరో సారి మా ఊరి కవి ఎలనార కలంపేరుతో
విలసిల్లుతున్న నాగరాజు రామస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.