ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఈ రోజు నా పిల్లలతో కలసి కార్టూన్ పిక్చర్ చూస్తుంటే అందులో 'మిణుగురులు' కనిపించాయి. దానితో చిన్నప్పటి జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. రాత్రిసమయాల్లో మిణుగురుల వెలుగు ఒక అద్భుతం. వాటిని పట్టి , అగ్గిపెట్టెలలో వేసి, ఆ అద్భుతాన్ని మాకు ఇచ్చేవారు మా నాన్నగారు. చిన్నగా మా చేతులతోనే తెరిపించి, వాటికి స్వేచ్ఛను ఇచ్చేవారు. నిజంగా 'మిణుగురులు' ఒక అద్భుతం. అవి అలా అగ్గిపెట్టెలో నుండి బయటకు వస్తుంటే, నెమ్మదిగా పరుచుకునే పసిడి వర్ణపు వెలుగులు చూస్తే రెప్పవేయలేం. ఆ వెలుగులు మా మోముపై ప్రతిఫలించి కన్నులు మిరుమిట్లు గొలిపేవి. ఆ ఆనందం వర్ణనాతీతం. ఇప్పుడు మిణుగురులు ఏవి? మనం తెలిసి-తెలియక చేసిన తప్పిదాల వల్ల ఇలాంటి ఎన్నో అద్భుతాలను కోల్పోయాం, కోల్పోతున్నాం. కాలుష్యాలు , కల్తీలతో సహజీవనం చేస్తూ ఎన్నో జీవజాతులకు మనుగడ లేకుండా చేసి మన మనుగడకు కూడా ముప్పు తెచ్చుకున్నాం. ఎటు వెళ్తున్నామో , ఏమవుతున్నామో తెలియకుండా ఉంది. ఆ చెట్లు , ఆ పచ్చదనం , ఆ ప్రకృతి శోభను పెంచితేనే మనకు మళ్ళీ ఆ పసిడి వర్ణాలు కనిపించవచ్చు. ' గోమతి '
June 27, 2020 • T. VEDANTA SURY • Memories