ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఈ రోజు రక్త నాళాలు ( బ్లడ్ వెసల్స్) గురించి తెలుసుకుందాం.మనిషి శరీరంలో రక్తం,రక్త నాళాల ద్వారా శరీరం భాగాల నుంచి గుండెకు, గుండె నుంచి శరీర భాగాలకు ప్రవహిస్తుంది.రక్త నాళాల సైజు,మందం, ఫన్షన్ ను బట్టి మూడు రకాలుగా విభజించారు.అవి; 1.ధమనులు( ఆర్టరీస్),2.సిరలు( వేయిన్స్),3.కేశనాళికలు( కాపిలరీస్).మొదటిది ధమనులు; ఇవి హృదయం నుంచి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.మందమైన శరీరం నిర్మాణం కలిగిన రక్త నాళాలు ఈ ధమనులు.ధమనిలో అంతర్, మధ్య,బాహ్య అనబడే మూడు పొరలు ఉంటాయి.మధ్య పొరలో సరళ కండర కణజాలం,బంధిత కణజాలం ( కనెక్టివ్ టిష్యూ) లు వుంటాయి.అందుకే ఇవి సంకోచ వ్యాకోచాలు కలిగిన స్పందన నాళాలు.దీనిలో కుహరం తక్కువ.రక్తం అధిక పీడనంతో ప్రసరిస్తుంది.ఇవి ప్యూరిఫైడ్ రక్తాన్ని శరీర భాగాలకు అందజేస్తాయి.పల్మనరీ ఆర్టరీ మాత్రం మలిన రక్తాన్ని పుపుసములకు చేరవేస్తుంది.కణజాలాల వద్ద ఇవి ధమనికలు అనే కేశనాళికలుగా( కాపిలరీస్), చీలి పోతాయి.ధమనుల్లో కవాటాలు వుండవు.ధమనులు చర్మానికి దిగువన కణజాలాల మధ్య లోతుగా వుంటాయి. మిగితాది రేపు........ ప్రమోద్ ఆవంచ
July 31, 2020 • T. VEDANTA SURY • Serial