ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉదయమా నీకు సుస్వాగతం.--శాంతి కృష్ణ
August 26, 2020 • T. VEDANTA SURY • Poem

ఓ కొత్త ఆశతో మొదలయ్యే రోజు
కలగానే ముగిసి పోతుందని బాధ ఎందుకు...
నీ కలలను సాకారం చేసుకునేందుకు
రేపటి ఉదయాన్ని నీవే నిద్రలేపు...!
ప్రతి రోజు నీ అంచనాలన్నీ
తలకిందులై పోతూ
ఎన్నో అనుభవాలను మాత్రమే నేర్పుతోందని
నిరుత్సాహమెందుకు...
అనుభవాల నుండి పాఠాలు నేర్చుకో...
ఎంత బాగా అంటే
మండే కొలిమిలో కాలుతూ
సుత్తి దెబ్బలు భరిస్తున్న
ఇనుప చువ్వలా...!
ఇనుప చువ్వ తనను తాను కాల్చుకుంటూ
ఓ రూపాన్ని సంతరించుకుంటుంది...

అనుభవాల కొలిమిలో కాలుతూ
మనమూ ఓ కొత్త రూపాన్ని పొందుదాం...
ఆశయాల వైపు అడుగులు వేసేందుకు...!!
(కింద ఉన్న పాత కొటేషన్ కు ఓ కొత్త అర్థం...)