ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉద్యోగ ధర్మం**డి.కె.చదువులబాబు-9440703716
October 2, 2020 • T. VEDANTA SURY • Story

అరుంధతీ రాజ్యానికి రాజు అమరసేనుడు.ఆరాజ్యానికి వివేకుడు మంత్రిగా ఉన్నాడు.ప్రమధ్వరుడు కోశాధికారిగా ఉన్నాడు.
బంగారం,ధనం కోశాగారంలో ప్రమధ్వరుడిఆధీనంలో ఉండేవి.ఒకసారి అకస్మాత్తుగా ప్రమధ్వరుడి దగ్గరి
బంధువు మరణించిన వార్త తెలిసి వెనువెంటనే  రాజధాని నుండి బయలుదేరిబంధువుల ఊరికి వెళ్ళిపోయాడు ప్రమధ్వరుడు.
ఆసమయంలో రాజ్యపరిపాలనకొరకు ధనం పెద్దమొత్తంలో అవసరమై మంత్రి కోశాగారం దగ్గరకు వెళ్ళాడు.తాను వచ్చినపని కాపలా దారులకు చెప్పాడు.ప్రమధ్వరుడి అనుమతి లేనిదే ఎవరినీ కోశాగారంలోనికిఅనుమతించమన్నారు వాళ్ళు."నేను ఈ రాజ్యానికి మంత్రినని తెలియదా?కోశాగారానికి సంబంధించిన ఒకజత తాళాలు నాదగ్గరున్నాయి.అంటే నాకూ లోనికివెళ్ళే అర్హతఉందనేకదా!మీకోశాధికారిప్రమధ్వరుడు నేను నియమించినవాడే ."అన్నాడు మంత్రి.అందుకు వాళ్ళు ఒప్పుకోక "అయ్యా!మమ్ములను నియమించుకున్నది కోశాధికారి ప్రమధ్వరుడు కదా!మేము వారికి జవాబుదారీగా వుండాలికదా!ఆయన మీకు తన బాధ్యతలను అప్పజెబుతూ స్వదస్తూరీ,సంతకంతో ఇచ్చిన లేఖ వుంటే ఇవ్వండి. అనుమతిస్తాము"అన్నారు.ప్రమధ్వరుడు ఏదైనా పనిమీద రాజధాని దాటివెళ్తున్నప్పుడు మంత్రికి లేఖ ఇచ్చి వెళ్ళేవాడు.అందులో ఏం వ్రాసాడో చూసేఅవసరం తనకు ఏరోజూ రాలేదు.ఈసారి
హుటాహుటీన బయలుదేరటం వల్ల,మరిచివెళ్ళిపోయాడు.ఆలేఖ అవసరమని మంత్రిఏరోజు అనుకోలేదు.ఆ విషయం వారికి
చెప్పినా ఒప్పుకోలేదు.మంత్రి వెళ్ళి రాజుకు విషయం చెప్పి "నన్నుకూడా లెఖ్క చెయ్యని వాళ్ళు ఒక్కక్షణంకూడా ఉండటానికి వీళ్ళేదు.తొలగిస్తాను."అన్నాడు ఆవేశంగా.రాజు నవ్వి "మంత్రివర్యా!మీ స్థానంలో ఎవరున్నా కోపం రావటం సహజమే.కానీ కొంచెంఆవేశం తగ్గించుకుని ఆలోచించండి.వారిఉద్యోగ ధర్మం వారు సక్రమంగా,నిజాయితీగా   నిర్వహిస్తున్నారు.ప్రమధ్వరుడికి మీరుఅధికారి కావచ్చు.వారికి మాత్రం ప్రమధ్వరుడే అధికారి.అతని అనుమతి లేనిదే లోనికివెళ్ళనివ్వని వారి కర్తవ్యనిర్వహణ ధర్మమైనదే కదా!.మన అవసరాన్ని ఒక్కరోజు వాయిదా వేసుకుంటే, ప్రమధ్వరుడువస్తాడుకదా,!"అన్నాడు.మంత్రి రాజు మాటలతో ఏకీభవించి వెళ్ళి
పోయాడు.మరునాడు ప్రమధ్వరుడు రాగానే ఎంతోనిజాయితీ పరులు,ఉద్యోగ ధర్మంపట్లఅంకితభావం కలవారిని ఎన్నికచేసి,కాపలా
దారులుగా నియమించినందుకు ప్రశంసించిసత్కరించాడు మంత్రి వివేకుడు.