ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉపాధ్యాయపర్వము-7: రామ్మోహన్ రావు తుమ్మూరి
November 18, 2020 • T. VEDANTA SURY • Memories

అందరికీ అన్ని అనుభవాలు కలుగటం అసంభవం.కొందరికి పల్లె జీవనం అంటే ఏమిటో తెలియకపోవచ్చు. చాలామందికి నగర్ జీవనం,నాగరిక జీవనం అనుభవంలోకి రాకుండానే జీవితం గడచి పోవచ్చు.  పారిశ్రామిక జీవనం అతి తక్కువ మందికి మాత్రమే అనుభవంలోకి వస్తుంది. అది అందరికీ సరి పడక పోవచ్చు కూడా.ప్రమాదాలకు అవకాశం ఉంటుంది.నిర్లక్ష్యంగా పని చేయడానికి అవకాశం లేదు.ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.అడుగడుగున మెలకువతో ఉండాలి.కొన్ని కచ్చితమైన నియమాలు అవలంబించాలి. 
   నేను లేబొరేటరీలో చేసిన పనికి నైపుణ్యం,సున్నితంగా పనిచేయటం చాలా అవసరమైతే ప్లాంట్ సైడు పనిచేసినప్పుడు ఒకేసారి అనేక విషయాలమీద దృష్టిని సారిస్తూ  పని చేసే నేర్పు కావాలి.మెదడు నిండా ప్లాంట్ వర్కింగ్ సిస్టం ఆవరించి ఉండాలి.అని ఎంత చెప్పినా ఆ ప్రాక్టికల్ సిచువేషన్ అర్థం చేయించటం కష్టం.
    ల్యాబ్లో సున్నితమైన గాజు పరికరాలతో పని చేయాల్సి ఉంటుంది. బ్యూరెట్లు, పిప్పెట్లు,కోనికల్ ఫ్లాస్కులు,రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్కులు,బీకర్లు,హాట్ ప్లేట్లు,ఓవెన్లు,మఫుల్ ఫర్నేసులు, క్రుసిబుల్స్,సున్నితపు త్రాసులు మ్యాంటిల్స్ ఇలా చెబుతూ పోతే చాలా
ఉంటాయి.ఒక్కొక్క ప్రయోగానికి ఒక్కొక్క ఆపరేటస్ అవసరమైతుంది.దాన్ని సున్నితంగా హాండిల్ చేయాలి. పేరు చెప్పటం బాగుండదు కాని మా ల్యాబ్ లో ఓ సీనియరుండే వారు.కంగారెక్కువ.
ఆయన చేతుల్లో చాలాసార్లు గాజు పరికరాలు పగిలిపోయేవి.అందుకని ఆయనకు ఏదైనా పని ఇవ్వాలంటే జంకేవారు మా ఇంచార్జ్.  ల్యాబ్ లో అనినిటికంటే ముఖ్యమైన రూల్ తీసిన వస్తువు మళ్లీ తీసిన చోట పెట్టటం. అలాగే ఎక్సపరిమెంట్ కాగానే పరికరాలన్నీ శుభ్రపరచటం,టైట్రేషన్ వంటి సమయాల్లో చాలా కీన్ గా ఉండటం,  ఏసిడ్స్ తో డీల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించటం ఇలా అనేకమైన విషయాలు ల్యాబ్ లో పనిచేసే అనుభవంలో ఉంటాయి.ఒక సిస్టమాటిక్ పనితీరు అలవడుతుంది.
      ఇక ప్లాంట్ వర్క్ కొంత రఫ్ అండ్ టఫ్.కొంత ఆపరేషనల్ టెక్నిక్.ప్లాంట్ సైడ్ వర్క్ దినదిన గండం నూరేళ్లాయుష్షు అన్నట్టుంటుంది. అంతా ఆటోమేటిక్.ఒకసారి ప్లాంట్ స్టార్ట్ చేస్తే ఏ ఆరునెల్లకో షట్ డౌన్ అవుతుంది ఏ ఆటంకం లేకపోతే.మూడు షిఫ్టులూ నిరంతరాయంగా ప్రొడక్షన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది.ఎల్లవేళలా ప్యానెల్ బోర్డ్ మీద కన్ను ఉండాలి. ఎప్పటికప్పుడు ఫీడింగ్ సప్లై ఔతుండాలి.అప్పరమత్తత చాలా అవసరం.ప్లాంట్ ఐదు ఫ్లోర్లు కనీసం షిఫ్టుకు రెండు మూడు సార్లు పైకి కిందికి ఎక్కి దిగాలి.క్వాలిటీలో తేడా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. లాబొరేటరీ వ్యక్తిగత జీవితంలాంటిదైతే,
ప్లాంట్ కుటుంబ జీవితం లాంటిధి.
 ప్లాంట్‌లో ఇతర ఆపరేటర్లు ఉంటారు.ఎవరి పని వారు సక్రమంగా చేయాలి.సూపర్ వైజర్ కుటుంబ యజమానిలా అందర్నీ అజమాయిస్తూ ఉండాలి.ఎక్కడ తేడా వచ్చినా ప్రమాదమే.(సశేషం)