ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉపాధ్యాయ పర్వం-3: - రామ్మోహన్ రావు తుమ్మూరి
November 14, 2020 • T. VEDANTA SURY • Memories


 సర్సిల్కు మిల్లు స్వరూప స్వభావం దాదాపుగా పరిచయం చేయటం జరిగింది.
    సిర్పూరు పేపరుమిల్లు స్థాపించబడక ముందు ఈ పెద్దవాగు ఒడ్డున ఉన్న పల్లెకు కొత్తపేట అని పేరుండేది. చారిత్రక ప్రసిద్ధమైన సిర్పూరుకు దగ్గరగా ఉండటంతో ఈ మిల్లులకు సిర్పూరు పేరు తగిలించారు. కొత్తపేట ప్రక్కనే నీటి అవసరాలు తీర్చే జీవవాహిని పెద్దవాగుండటంతో పరిశ్రమకు అనువైన ప్రదేశంగా అప్పటి నిజాం నియుక్త పరిశీలకులు ఎంపికచేశారు.
పెద్దవాగు ప్రాణహితలో కలుస్తుంది. ప్రాణహిత గోదావరి ఉపనది.
      కొత్తపేటలో కాగితం మిల్లు ఏర్పడిన తరువాత కాగజ్ నగర్ అయింది.ఇదే సిర్పూర్ కాగజ్నగర్ గా ప్రసిద్ధి పొందింది.
ఒకప్పటి ఆదిలాబాదు జిల్లా ఈనాటి ఆసిఫాబాదు జిల్లాలో  ఇప్పుడు ఒక ప్రముఖ పట్టణం.హైదరాబాదు-ఢిల్లీ లేదా చెన్నై-ఢిల్లీ రైల్వే మార్గంలో ఇది ఒక ప్రముఖ రైల్వే స్టేషన్.కాగజ్ నగర్ ను మాంఛెస్టర్ ఆఫ్ ఇండియా అనిపిలిచే వారు నేను చేరిన కొత్తలో.అలాగే అక్కడ దేశంలోన అన్ని ప్రాంతాల ప్రజలుండ టంతో మినీ ఇండియాగా కూడా పిలువ బడేది.
      ఇక మా మిల్లు సంగతికి వస్తే  మా మిల్లు a chemically based artificial rayon factory అని ఉదాహరించబడే దన్న దానికి ఇంతకు ముందు నేను వివరించిన విషయాలు ఉపకరిస్తాయి.
ప్రభుత్వ అనుమతితో ప్యూర్ ఆల్కహాలు దిగుమతి చేసుకొని దానితో కావలసిన అన్ని రసాయనాలను తయారు చేయటంతో ఈ ఫ్యాక్టరీలోని జనరల్ లేబొరేటరీకి అత్యంత ప్రాధాన్యం ఉండేది.సెల్యులోజ్ ఎసిటేట్ తయారీలో ఏ చిన్న తేడా వచ్చినా మొత్తం ఉత్పత్తి మీద ప్రభావముండేది కనుక C.A.dept. ల్యాబ్ రిజల్ట్స్ మీద ఆధార పడి ఉండేది.
ఎసిటిక్ ఆసిడ్ మరియు ఎసిటిక్ ఎన్ హైడ్రైడు మిశ్రమం 43.5 %కొంచెం అటూ ఇటూగా ఉండాలి.ప్రతిషిఫ్టుకు ఒక బ్యాచ్ మిశ్రమం తయారయ్యేది. దాని సాంపిల్స్ ల్యాబ్ కు పంపేవారు.
బెంచి కెమిస్టు ఎవరుంటే అతను ఎనాలిసిస్ చేసి రిజల్ట్ ఇస్తే రిజల్ట్ ఆధారంగా మిశ్రమం లో హెచ్చు తగ్గులు సవరించబడేవి.మిశ్రమంలో గనక తేడా వచ్చిందో దానితో తయారయిన సెల్యులోజ్ ఎసిటేట్ క్వాలిటీ దెబ్బ తింటుంది.ఒక బ్యాచ్ చెడిపోతే కొన్ని టన్నుల ఉత్పత్తి వ్యర్థమైపోయి ఆర్థిక నష్టం ఉంటుంది కనుక ఆ సాంపిల్స్  ఎనలైజ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది.సాధారణంగా ఆ బెంచి బాగా శ్రద్ధాసక్తులుగల అనుభ వజ్ఞులకు సీనియర్లకు ఇవ్వబడేది. ల్యాబొరేటరీ ఫలితాలన్నీ ఉపయోగించే నార్మల్ సొల్యూషన్స్ మీద ఆధారపడి ఉంటాయి గనుక ల్యాబొరేటరీకి కావలసిన నార్మల్ సొల్యూషన్స్ తయారుచేయడానికి మరింత అనుభవజ్ఞులకు సొల్యూషన్ బెంచి బాధ్యత అప్పగించేవారు.కనీసం పదిసంవత్సరాల అనుభవం ఉన్నవారికి మాత్రమే ఇచ్చేవారు. ఎందుకంటే రౌండ్ ద క్లాక్ నడిచే ఫ్యాక్టరీకనుక మూడు షిఫ్టుల్లో సాంపిల్స్ వస్తాయి కనుక అనేక సార్లు ఎనాలిస్ చేయవలసి ఉంటుంది కనుక చేసినప్పుడల్లా 15 లీటర్ల నార్మల్ సొల్యూషన్ తయారు చేయటం జరిగేది.
నార్మాలిటీ లెక్క కట్టంలో డెసిమల్ స్థాయిలో తప్పినా నష్టం లక్షల్లో ఉంటుంది కనుక ఆ బెంచికి అత్యంత ప్రాధాన్యత ఉండేది.ల్యాబ్ కు కావలసిన దాదాపు 50,60 రకాల సొల్సూషన్స్ తయారు చేయవలసి ఉండేది.
మిత్రులారా!చెబితే గొప్పనుకుంటారు.చెప్పక పోతే విషయం తెలియదు.అలాంటి వెరీ ఇంపార్టెంట్ బెంచి బాధ్యత నాకు నా మూడేళ్ల సర్వీసు కాగానే దొరికింది.నా ఏడేళ్ల ల్యాబ్ సర్వీసులన నాలుగేళ్లు ఆ పనే చేశాను.I still feel proud of my self
Performing successfully ,that job which gave me most satisfaction in my life.ఈ విషయంలో నన్ను తీర్చి దిద్గిన వి.ఆదినారాయణ (నా కంటే ముందు ఆ బెంచి వర్క్ చేసిన సీనియర్),నా పని తీరును మెచ్చి నా మీద నమ్మకంతో బాధ్యత అప్పజెప్పిన మా డిపార్టుమెంటు ఇంఛార్జ్ శ్రీధరన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ వర్క్ తో పాటు ల్యాబ్ లో మిగతా అన్ని బెంచీల వర్క్ అంటే గ్యాస్ ఎనాలిసిస్,వాటర్ ఎనాలిసిస్, యార్న్ ఎనాలిసిస్,కోల్ ఎనాలిసిస్ వంటివి కూడా చేయటం నేర్చుకున్నాను.ఇక ల్యాబ్ లో  చేసే కొత్త పని లేక,రొటీన్ ఇష్టం లేని నేను ఎసిటిక్ ఏసిడ్ ప్లాంట్ సూపర్వైజరుగా పని బదలాయించుకున్నాను.నా సంగతి తెలిసిన వారు గనుక కెమికల్ వింగ్ వర్క్స్ మేనేజరు శాసోజీరావుగారు నన్ను అభ్యంతరపెట్టకుండా తీసుకున్నారు.అందులో నాలుగేళ్లు పనిచేశాను.కనుక నా ఉద్యోగ పర్వమంతా ఉపాధ్యాయ శిక్షణ కిందనే వస్తుంది.ఇదంతా కంపెనీలో ఉన్నంత సేపే.బయటికి వస్తే సర్సిల్క్ సరిగమలే.(సశేషం).
కెమిస్టు రాముడు