ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉల్లిపాయంత ఊరు: --డాక్టర్ కందేపి రాణి ప్రసాద్
October 26, 2020 • T. VEDANTA SURY • Story

  అనగనగా ఉల్లిపాయంత ఊరు ఉన్నది. మీ ఊరులో చింతకాయ అంత చిన్నోడు ఉన్నాడు. చింతకాయ ంత చిన్నోడికి చేటంత చేను ఉన్నది. ఒకరోజు చేటంత చేనులో వాడికి వంకాయంత వజ్రం దొరికింది. వంకాయంత వజ్రాన్ని తీసుకొని తన ఇంట్లో బీరకాయంత బీరువాలో దాచుకున్నాడు. ఏ దొంగలు దోచుకోకుండా దానికి తాటికాయంత తాళం వేశాడు.దీన్ని గమనించిన ఒక దొండకాయ అంత దొంగ వచ్చి తాటికాయంత తాళం పగులగొట్టి బీరకాయంత బీరువా తెరిచి వంకాయంత వజ్రం తీసుకొని పారిపోయాడు. ఇలా వంకాయంత వజ్రాన్ని దోచుకొని పారిపోతున్న దొంగను మునక్కాయ ఎంత ముసలమ్మ చూసింది.దొంగ ను చూసిన వెంటనే మునక్కాయ ఎంత ముసలమ్మ వెళ్ళి పొట్లకాయంత పోలీసు కు చెప్పింది.పొట్లకాయంత పోలీసు వచ్చి దొండకాయ అంత దొంగ ని పట్టుకొని జామకాయ అంత జైల్లో పెట్టి తాటికాయంత తాళం వేశాడు. దొండకాయ అంత దొంగ దగ్గర్నుంచి వంకాయంత వజ్రాన్ని తీసుకొని చింతకాయ ఎంత చిన్నోడికి ఇచ్చివేశాడు. చింతకాయ ఎంత చిన్నోడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.