ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉల్లి గడ్డలు -ఎన్నో ప్రయోజనాలు -4- పి . కమలాకర్ రావు .
August 31, 2020 • T. VEDANTA SURY • health tips

కొందరికి తీవ్రమైన విరేచనాల వలన శరీరం శుష్క్రించి కొంతకాలం వరకు బలహీనంగా కనిపిస్తారు . అలాంటి వారు నిప్పులపై ఉడికించిన ఉల్లిపాయను మెత్తగా చేసి అందులో వేయఁచిన గసగసాల పొడి కలిపి ప్రతి రోజు తింటే , కొద్ది రోజులల్లో శక్తిని పుంజుకుంటారు . పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు . మోకాళ్ళలో నొప్పులు , వాపులు ఎక్కువైనప్పుడు ఎఱ్ఱని ఉల్లిగడ్డను ముద్దగా దంచి అందులో ఆవాల పొడి వేసి కలిపి మోకాళ్లపై రాత్రి పడుకునేముందు కట్టుకుని ఉంచితే మోకాళ్ళ నొప్పులు ,వాపులు తగ్గి పోతాయి. తేలు కాటు వేస్తె , ఉల్లిగడ్డను అడ్డముగా కోసి కాస్త సున్నం రాసి కొట్టిన చోట రుద్దితే విషయాన్ని పీల్చుకుంటుంది.జెర్రీ కుడితే ఉల్లి గడ్డ +వెళ్లి పాయలు సమనగా తీసుకుని,  దంచి ఆ ముద్దను కుట్టిన చోట కడితే విషయాన్ని పీల్చు కుంటుంది.