ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎద్దు-- డాక్టర్ . బి. వి. ఎన్ .స్వామి
September 28, 2020 • T. VEDANTA SURY • Story

అంజయ్యను బుంగి పరిచయం చేసిండు. ఆ పరి చయంతో అతడు అనేక సార్లు నన్ను కలిసిండు. అత్యంత పేదరికంలో ఉన్నా కుటుంబాన్ని సజావుగానే నడుపుకుం టున్నడు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు తండ్రితో కూలిపనులకు పోయి చేదోడువాదోడుగా ఉంటున్నడు. రెండోవాడు డిగ్రీ చదివి కాయకష్టం చేయలేని స్థితికి వచ్చిండు. వాడికిపడు ఉద్యోగం కావాలె. అదీ సమస్య. ఉన్నతోద్యోగినైన నేను ఉద్యోగం ఇప్పించగలననే నమ్మకంతో ఉన్నడు.
‘‘ఒకరికింద పనిచేయడం ఏంది. స్వయం ఉపాధి కల్పించుకోవాలి’’ అన్నాను
‘‘అదెట్ల సారు’’ అన్నడు
‘‘బ్యాంక్‌లోన్‌కు అప్లై చేయమను మీ వాణ్ణి’’
‘‘ఏమని సారు’’
‘‘డబల్ రోట్టె తయారు చేసే పరిశ్రమ పెట్టుకుంటానని దరఖాస్తు చేయమను’’ ఉచిత సలహా ఇచ్చాను.
అప్పటి నుండి కొద్దిరోజుల వరకు అంజయ్య కనపడకుండా పోయిండు. ఒక రోజు ఉదయాన్నే వచ్చి కలిసిండు. చెపలరిగేటట్లు తిరిగినట్లున్నాడు. మొఖంలో అలసట ఉంది. పక్కేక ఎద్దులాగా పెరిగిన ఆయన కొడుకున్నడు.
‘‘ఏంటి సంగతులు’’ అన్నాను.
‘‘సార్, బ్యాంక్ అధికారులు ఎన్నో మెలికలు పెడుతున్నరు. లోన్ వచ్చేలా లేదనిపిస్తుంది’’. అన్నడు 
‘‘సరే. నేను తెలుసుకొని చెప్త. రేపు కలవండి’’ అన్నాను.
వాళ్లు వెళ్ళిన వెంటనే బ్యాంకు అధికారులతో మాట్లాడిన దరఖాస్తుదారు సొంతవనరులతో ఏర్పాటు చేసుకున్న సామాగ్రిని వాల్యూయేషన్ చేయించి లోన్ ఇస్తం. అడ్వాన్స్‌గా లోన్ ఇవ్వలేమన్న అధికారుల మాటతో గుండె ఆగినంతపనైంది. తిండికే కటకటగా ఉన్న అంజయ్య ముందస్తు పెట్టుబడి ఎక్కడి నుండి తేగలడు. ఒకవేళ తప్పనిసరై తేవాల్సివస్తే వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళాల్సి ఉంటది. ఆ ఊహ రావడంతో ముచ్చెమటలు పోసినయి. ‘‘బుంగీ ఎంత పనిచేసినవురా’’ అనుకున్నాను.
అడిగిన జీతం బియ్యని
విడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడిదున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ
సుమతి శతకం
బద్దెన