ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎరుక .....:-------కె.ఎల్వీ
November 15, 2020 • T. VEDANTA SURY • Poem

ఎప్పుడూ...
అనుకుంటూనే వుంటాను
అలా చేయ కూడదని !

అందులో --
తలదూర్చకూడదని !

ఎందులోనూ ...
వేలుపెట్టకూడదని !

నేను చేసింది 
మంచిపనే ...అని ,
ప్రోత్సహిస్తుంది 
నామనసు ....!

ఎదుటి వాళ్ల 
హృదయం అర్థం చూసుకుని 
ప్రవర్తించు ...
అని హెచ్చరిస్తుంది 
నా ..మస్తిష్కం ....!

అయినా ..
మళ్లీ ఎదురుతిరుగుతుంది 
నామనసు ....!

నావాళ్ళ కోసం 
నాకనీస కర్తవ్యం ఇది 
అంటూ ...
తన్నుతాను 
సమర్ధించు కంటుంది 
అమాయకపు మనసు !

ఇది నీస్వార్ధం ...
నీ ..కుళ్ళుబోతుతనం 
అని ..వెక్కిరిస్తుంది 
నా  మస్తిష్కం ....!!