ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎలక్ట్రో కార్డియోగ్రామ్(ECG);: --గుండెకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవటానికి ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ( ECG) చేస్తారు.గుండె సంకోచిచే సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కార్యకలాపాలనురీడింగ్ చేస్తుంది.గుండె కండరాల విద్యుత్ కార్యకలాపాలను ఈసీజీ మిషన్ రికార్డు చేసి, దానికి సంబంధించిన రీడింగ్స్ లను మిషిన్ లోని పేపర్ లో చూపిస్తుంది.దానిని డాక్టర్ చూసి సలహాలు సూచనలు ఇస్తారు.ఆరోగ్య కరమైన మనిషి గుండె ఈసీజీ కారెక్టరిస్టిక్ షేప్ లో వుంటుంది.గుండె లయలు సక్రమంగా కొట్టుకోకపోవడం, గుండె కండరాలు దెబ్బతినడం వంటివిజరిగినప్పుడు ఈసీజీ లో మార్పులు వస్తాయి. కుటుంబ చరిత్ర,అధిక బరువు,రక్త పోటు,అధిక కొలెస్ట్రాల్, షుగర్ వున్నవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళకు గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉంది.వాళ్ళకు డాక్టర్ ఈసీజీ చేసుకోమని సూచిస్తారు. గుండె సమస్యలను గుర్తించడానికి, కార్డియాక్ పేస్ మేకర్స్ పనితీరుని అంచనా వేయడానికి, గుండె జబ్బులలో వాడే మందులను మానిటర్ చేయడానికి ఈసీజీ ఉపయోగపడుతుంది. మిగితాది రేపు... ప్రమోద్ ఆవంచ
August 8, 2020 • T. VEDANTA SURY • Serial