ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎలా తినగలనమ్మా: - యామిజాల జగదీశ్
November 4, 2020 • T. VEDANTA SURY • Story
  • ఇది గురునానక్ చిన్ననాటి సంగతి. 
  • ఓరోజు గురునానక్ వాళ్ళ అమ్మ అతనికి ఓ స్వీట్ ఇచ్చి తినమంది. 
  • అయితే గురునానక్ ఆ స్వీటుముక్క తీసుకుని వీధిలోకెళ్ళడానికి అడుగులు వేస్తుండగా అతని తల్లి అడ్డుపడింది.
  • "వీధిలోకెళ్ళకు. అటూ ఇటూ కుర్రాళ్ళు నీ దగ్గర లాక్కోవచ్చు. ఎవరికీ తెలీకుండా ఇంట్లోనే తినేసే" అంది.
  • గురునానక్ సరేనని ఇంట్లోనే ఉన్నాడు. అతని తల్లి పనులమీద బయటకు వెళ్ళి చాలాసేపు తర్వాత ఇంటికి చేరుకుంది. 
  • అప్పటివరకూ గురునానక్ ఆ స్వీట్ తినలేదు.
  • "ఎందుకు తినలేదురా?" అని గురునానక్ ని తల్లి అడిగింది.
  • "ఎలా తినగలనమ్మా? ఎవరికీ తెలీకుండా ఎవరూ చూడకుండా తినేసేమన్నావు. కానీ అదెలా సాధ్యం? ఇరుగుపొరుగు వాళ్ళకు కనిపించకుండా తినగలను కానీ దేవుడు అంతటా ఉంటాడు కదమ్మా? మరి దేవుడు చూడకుండా ఎలా తినగలనమ్మా?" అన్నాడు గురునానక్.
  • అప్పుడు అతని తల్లికి తానన్న మాటలోని తప్పు తెలిసి బాధ పడింది.
  •