ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎవరి మెప్పుకోసం : -కళావతి కందగట్ల -హైదరాబాద్--9948263004
November 18, 2020 • T. VEDANTA SURY • Poem

ఎందరో మహాత్ముల 
త్యాగ ఫలితం
మన స్వాతంత్య్రం... 
ఆ  నాయకులు జీవితాలు 
అందరికీ ఆదర్శం.... 

వారు చూపిన బాటలో 
పయనిస్తూ.... 
నిస్వార్థంగా జీవితాన్ని 
గడుపుతూ.... 
పరులు సేవలో పరమాత్ముడిని 
దర్శించాలే కానీ.... 

వెర్రి వేయి విధాలన్నట్టు 
నాయకుల శిలా విగ్రహాలకు 
పాలాభిషేకాలు..
ఎవరి  మెప్పు కోసం 
తమ పేరు కోసం తప్ప... 

పాలుతాగే పసిపిల్లలకు
పాలు కరువు... 
పేరుకోసం పాకులాడే 
వారివల్ల పాలన్నీ నేలపాలు 
ఎందుకీ దుస్థితి 
ఎప్పుడు మారును ఈ పరిస్థితి