ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎవరు సుకుమారి..(బేతాళకథ)- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు, చెన్నై : -పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టువద్దకు వచ్చి బేతాళుడిని బంధించి భుజానవేసుకుని మౌనంగా నడకసాగించాడు.శవాన్ని ఆవహించిఉన్నబేతాళుడు 'మహీపాలానీకార్యదీక్షత,పట్టుదల మెచ్చదగినవి.మనప్రయాణంలొ నీకు అలసట తెలియకుండా ఎవరు సుకుమారి అనే కథ చెపుతాను విను..పూర్వంఅమరావతి రాజ్యాన్నిధర్మధ్వజుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు. అతను వంశకేతుడు అనేపేరున ప్రసిధ్ధిచెందాడు.అతనికి ధారావళి, ఇందులేఖ,మృగాంగావతి అనే ముగ్గురు భార్యలను ఒకేముహుర్తంలో వివాహం చేసుకున్నాడు.మెదటిభార్య ధారావళితో ఉద్యానవనంలో విహరిస్తూ ఓపూల పొదవద్ద సేదతీరసాగారు.అప్పుడు రాజుగారిచేతిలో మల్లేపూవు చేజారి ఆమె ఓడిలో పడింది.దాని బరువుకు ఆమె గిజగిజలాడింది.అదేసమయంలో ఆమె జడలోని పారిజాతపుష్పం లోని తేనె కొరకు ఒ తుమ్మెద పుష్పంపై వాలింది.ఆతుమ్మెద బరువు మోయలేక ధారావళి పక్కకు వాలి సృహతప్పింది.అదిచూసిన ఆమె చెలికత్తెలు సపర్యలు చేసి ఆమెను భద్రంగా రాణివాసం చేర్చారు.పెద్దభార్య సుకుమారత్వం చూసిన ధర్మధ్వజుడు అచ్చెరు వొందాడు.మరుదినం రాత్రి తనరెండో భార్య అయిన ఇందులేఖ మందిరానికి వెళ్ళిన రాజు ఆమెతో శయ్యపై నిద్రకు ఉపక్రమించాడు.గవాక్షం నుండి పున్నమి చంద్రుని వెన్నెల శయ్యపై ఉన్న ఇందులేఖ చేతిపై పడింది.ఆవెన్నెల వెలుగు సోకినంత మేరా శరీరం కందిపోయి బాధతో కేకలు వేసింది. పరుగున వచ్చిన చెలికత్తెలు,చందనం,తులసి రసం ఆమెచేతిపైపూసి ఆకులతో విసిరి సేదతీర్చారు.అదిచూసిన రాజు తనభార్య కోమలత్వానికి ఆశ్చర్యపోయాడు.మరుదినం మూడో భార్య మృగాంగావతి మందిరానికి వెళ్ళి శయనించ బోతున్న సమయంలో కోట వెలుపల దూరంగా ఎవరో జొన్నలు దంచుతున్న శబ్ధం వినిపించింది.ఆశబ్ధానికే చేతివేళ్లు కందిపోయి బాధతో విలవిల లాడింది మృగాంగావతి.అదిచూసిన చెలికత్తెలు మందిర ద్వారాలు మూసి ఆమె చెవులలో దూది ఉంచారు.అదిచూసిన రాజు తనమూడో భార్య సుకుమారత్వనికి అమితంగా ఆశ్చర్యపోయాడు.అప్పటి వరకు కథ చెప్పిన బేతాళుడు.విక్రమార్క మహరాజా తుమ్మెద బరువుకే సోలిపోయిన మెదటిభార్య.వెన్నెల వెలుగు సోకి కందిపోయిన రెండో భార్య,ఎక్కడో దూరాన జొన్నలు దంచుతున్న శబ్ధానికే చేతివేళ్లు ఎరుపెక్కిన ముడవ భార్య ,ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప సుకుమారి. తెలిసిసమాధానం చెప్పక పోయావో నీతలపగిలి మరణిస్తావు'అన్నాడు బేతాళుడు.'బేతాళ ఇందులేఖ,ధారావళి స్మర్శ కలిగిన తరువాత బాధ అనుభవించారు.కాని స్మర్శ లేకుండానే దూరంగా వినిపించిన శబ్ధానికే మృగాంగవతి వేళ్లు కందిపోయాయి...కనుకఆమే అతిసుకుమారి'అన్నాడు విక్రమార్కుడు.విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహ బేతాళుడు మాయం అయ్యాడు. పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు మరలా వెనుతిరిగాడు.
August 4, 2020 • T. VEDANTA SURY • Story