ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఏదైనా వదిలి పో--కె ఎస్ అనంతాచార్య
September 26, 2020 • T. VEDANTA SURY • Poem

ఏ క్షణం లో
పెళుతుందో ఈ బెలూన్  భరోసా లేని ప్రాణం, వ్యామొహం పెంచుకున్న తనువు 

క్షణ భంగుర జీవితంలో కొన్నైనా ఆనవాళ్లు భూమిపైన
ఉంచిపో

ఎప్పుడూ నీ చుట్టూ తిరిగే నీవు స్వార్థం గ్రహణం పడితే చివరికి
నలుగురు కరువవుతారు

మనో విచేలితులకు
చేయూత నిస్తే
మదిలోని ఆటుపోట్లు
తీరం దాటుతాయి

అవసరాలకు అసరా అయి కన్నీటిని తుడుస్తే అంతిమ
యాత్రలో ఆ కళ్లే చెమరుస్తాయి

శిలాఫలకాల పై పేర్లుకావు హృదయ ఫలకాల్లో ప్రేమాక్షరాలై
నిలిచిపో

ఆకాశం నుండి
అధోలోకాల నుండి
గంగను దింపి పునీతుల చేసిన భగీరథుడికన్నా స్ఫూర్తి ఎవరు?

పిడికెడు కరుణను పంచు రుజాగ్రస్తుల
వెంట ఉంటే కనీసం కావ్యాల్లో నీ అక్షర ఉనికి కనపడుతుంది

తలచుకొనే వీరుడువై పోరాడు యుద్ధం లో
వీర మరణం పొందినా సరే

ప్రజల నాడీ పట్టుకొని
ఈడేర్చే
నాయకుడివైతే
కొలిచే దేవుడవై కోటి నీరాజనాలందుతావు

జనన మరణాలు జనం పండుగ
లైనప్పుడే జగదేక వీరుడవవుతావు

జాడలు,నీడలు వెతికేలా అనునయించే దారిలా
ఏదైనా గుర్తును 
వదిలిపో