ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఏర్టియే వెంట్రిక్యూలార్ నోడ్ నుండి ఏర్పడు ప్రత్యేక పోగుల సముదాయాన్ని బండల్ ఆఫ్ హిజ్ అంటారు.ఈ పూర్తి వ్యవస్థ ను పర్ కిన్ జే వ్యవస్థ అంటారు.సైనో ఏట్రియల్ నోడ్ నుంచి ఉత్పత్తి అయిన కరెంట్ సైనో వెంట్రిక్యూలార్ నోడ్ కి చేరుతోంది.ఇలా చేయడం వల్ల మయేకార్డయమ్ అనే కండరంతో నిర్మితమైన గుండె ను స్పందిస్తుంది.గుండెను స్పందింప చేసే ఎలక్ట్రికల్ ఇంపల్స్ సైనో ఏట్రియల్ నోడ్ నుంచి ఉత్పత్తి అవుతాయి.మొదట పై రెండు గదులు స్పందిస్తాయి.తరువాతకొంత కరెంట్ ప్రవాహం తగ్గి కింది గదులు స్పందిస్తాయి. లయబద్దంగా స్పందించాల్సిన గుండె కొట్టుకోవడం లో మార్పులు వచ్చే అవకాశం ఉంది దీనిని డిస్ ఫంక్షన్ ఆఫ్ కండక్షన్ సిస్టమ్ అంటారు.ఇలా ఎందుకు జరుగుతుంది? జరిగితే సమస్యలేమిటి? రేపు తెలుసుకుందాం.-- ప్రమోద్ ఆవంచ
July 25, 2020 • T. VEDANTA SURY • Serial