ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఏ పిల్లలూ : జయంత్ నామిలకొండ
August 25, 2020 • T. VEDANTA SURY • Poem

ఏపిల్లలూ సరదాగ
ఏంముచ్చట్లాడుతున్నారు?
ఉట్టి చూసారా మీ అమ్మమ్మో నానమ్మో
మంచి గేద పాలే తోడే పెట్టేవారు.

ఘుమ ఘుమ వంటింట్లో
ఆహా గడ్డపెరుగువాసనే
ఇల్లంతా కమ్ముకొనేది
ఆహా! మా అమ్మే పొదు పొద్దే
మీగడే మాకు కొంచెం ఉంచి
మిగిలినది ఆహా! బాగ కాచి
రవ్వ రవ్వలా నెయ్యే తయారుజేసేది.

మీగడపేరుగన్నమే వేడి వేడి అన్నమే
కల్పిస్తే అందరము సంతోషంతో హాయిగతిని
మాబడికే వెళ్ళీ గొప్ప గొప్పగా చదువులే
చదివి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారిమే.

ఆటలతో కమ్మని పిట్ట కథలతో
అమ్మ నాన్న ఒడిలో ఎంతోహాయిగా
బజ్జొంటూ వినేవాళ్ళము
మబ్బులనే లేసి అమ్మకు ఇంటిపనిలో
నాన్నకుతోడుగా ఏపనైనా చేసి చదువుకుంటిమీ.

ఉట్టి మీది మీగడా నా నమ్మకు తెలువకే
చిలిపిగా దోసిల్ల తో దోచుకునేవారమే
పిల్లిలా మ్యావ్ మంటు గొడవే చేయకా
ఆటపట్టించీ హాయిగా పెద్దలతోనే ఉండేవారిమే
ఆటలెన్నో మరి ఆడుకొనేవారమే సంబరాన.