ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఐనా.. నేను ఓడి పోలేదు..--పుస్తక సమీక్ష : చిటికెన కిరణ్ కుమార్--సెల్.. 9490 84 1284
September 16, 2020 • T. VEDANTA SURY • Book Review

ప్రతి వ్యక్తిలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా బయటకు తీసి ఈ యాంత్రిక జీవితంలో ఎలా ముందుకు పోవాలో ఏ విధంగా తన గమ్యాన్ని చేరే క్రమంలో వచ్చే ఒడిదుడుకులను ఈ ప్రపంచానికి తెలియజేసి అద్భుత కరదీపిక “ ఐనా నేను ఓడిపోలేదు “  శ్రీమతి జ్యోతి రెడ్డి గారి ఆత్మకథను పాఠకులకు అందించే క్రమంలో పుస్తకం మొదటి నుండి చివరి వరకు ఎక్కడా కూడా రచయిత వల్లీశ్వర్ గారు చెబుతున్నట్లుగా లేదు. పుస్తకం మొత్తం కూడా పాత్ర నే   పాఠకున్ని  చదివించే దిశగా కళ్ళకు కట్టినట్లుగా వల్లీశ్వర్ గారు రాసారు 
        నేటి కాలంలో ఆత్మకథలను చదవాలి అంటే పాఠకులు కొద్దిపాటి వెనకంజ వేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఈ పుస్తకం ఇప్పటి వరకు లక్ష పైచిలుకు కాపీల  ప్రచురణ జరిగింది అంటే అది పాఠకున్ని ఆ పుస్తకం చదివించే తీరుని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆసక్తిని ఏ శక్తి అడ్డుకోలేదని, ఆత్మవిశ్వాసం ముందు ఏదైనా భానిస  కాకతప్పదని నేటి యువతరానికి నిలువుటద్దంలా నిలిచింది ఈ పుస్తకం “ ఐనా నేను ఓడిపోలేదు”... ఒక పేదింటి మహిళ పడ్డ కష్టాలను సాధారణంగా పుస్తకాలలో,  కథలలో ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ ఒక కూలీ నుండి సాఫ్ట్ వేర్ కంపెనీ CEO గా  ఎదిగిన శ్రీమతి జ్యోతి రెడ్డి గారి ఆత్మకథ పుస్తకాన్ని పరిశీలిస్తే.....  ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే సంఘటనలు తను ఎదుర్కొన్నటువంటి పరిణామాలు, మాటలకు అందని భావోద్వేగాలు అక్షర రూపంలో రాసి నేటి యువతకు కనువిప్పు కలిగించే  విధంగా ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచేట్లుగా రచయిత గారు పాఠకునికి అద్భుతంగా అందించారు.
       ప్రధానంగా చెప్పాలంటే ఈ పుస్తకంలో జ్యోతి రెడ్డి గారు ఆత్మహత్య చేసుకోవాలి అని పూర్తిస్థాయిలో నిర్ణయించుకున్న తరువాత ఆ వ్యవసాయ భావి దగ్గర ఇద్దరు పిల్లలతో కలిసి తను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పే  క్రమంలో జ్యోతి రెడ్డి గారి భావోద్వేగాన్ని పాఠకునికి చేరవేసే తీరుని, మైలారం నుండి అమెరికా వెళ్లి స్థిరపడి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని గా ( పేద తరగతి నుండి ఉన్నత స్థాయి గా ) ఎదిగిన మధ్యకాలంలో జరిగిన పరిస్థితులను, అవమానాలను, దశలవారీగా తను తన లక్ష్యసాధన కోసం, ఆ పేదరికాన్ని ఎదుర్కోవాల్సిన ప్రతి సంఘటనను  చాలా ఉత్తమంగా పాఠకునికి అందించారు.
        జీవితంలో ప్రతి యువతీ యువకులు చదవాల్సిన పుస్తకం. నేటికీ ఎందరినో మార్గదర్శిగా నిలిపి,  ఆత్మవిశ్వాసానికి మరో పేరు గా నిలిచింది ఈ పుస్తకం