ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఒంటరి ఓ మనిషి కరోనా తో జర్నీ కరోనా--రచన : రెబల్లి మత్స్యగిరి--మనిషి ఒంటరి అయ్యాడు, నిజంగానే మనిషి అనేవాడు దిక్కతోచని స్థితిలోకి జారిపోయి బావురు మన్నాడు. ప్రపంచమంతా నాదేనని రంకెలేసిన మనిషి, చావు భయం తో చాటుగా దాగిపోయాడు. ప్రకృతి లో మమేకం కావాల్సినవాడు, ప్రకృతి తో ప్రయాణించాల్సినవాడు, అలాంటి ప్రకృతి నే తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. కానీ ఆ విధి కబంధ హస్తాల్లో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.పురాణాల్లో అసురులు ముల్లోకాలు జయించాలని తపించారు, ధర్మం తప్పి ప్రపంచాన్ని, ప్రకృతిని శాసించాలని చూసారు. హరిహరాదులు వారిని రూపుమాపడానికి అవతారాలు ఎత్తాల్సివచ్చేది.ఇప్పుడు ఆ అసురులు లేరు, వారి స్థానాల్లో మనుషులే రాక్షస లక్షణాలు ఆవాహనం చేసుకొని ప్రపంచాన్ని కబ్జా చేయడం మొదలు పెట్టాడు. ప్రతి ప్రాణి తనకోసమే అనుకోని పెత్తనం చేసాడు. ప్రతి జీవి ఉనికిని ప్రస్నార్ధకం చేసాడు. రక్షణ గా ఉండే ఓజోన్ పొరనే ఛిద్రం చేసాడు. మనిషి తప్పు చేసాడు, తప్పులు చేస్తున్నాడు, తప్పుడు దారిలో తప్పిపోయాడు.తొలి ప్రాణి అమీబా నుండి ఆదిమానవుడి దాక సాగిన బ్రతుకు ప్రయాణం ఎక్కోడో గతి తప్పి దారిమళ్లింది. మొదట బుద్దిజీవి గా రూపాంతరం చెంది, చివరికి దుర్బుద్ధి మనిషి గా మిగిలిపోయాడు.నిప్పును రాజేసినవాడు, ఆయుధాలు విసిరినవాడు, చక్రాలు తిప్పిన వాడు, పనిముట్లను తయారు చేసాడు, వ్యవసాయం నేర్చినవాడు, నాగరికత ఏర్పర్చినవాడు, వ్యాపారాలు మొదలు పెట్టాడు, అభివృద్ధి అన్నాడు, ఆధునికత అన్నాడు మరి ఎందుకో మనిషి మారిపోయాడు.నాది నాది అంటూ హద్దులు గీసుకొని యుద్దాలు చేసాడు. తరతమ భేదాలు తో మతాలు కులాలు అన్నాడు. కుట్ర కుతంత్రాలతో బతుకు పోరాటం లో సాటి మనిషి నే దోచుకున్నాడు.తుపానులు వచ్చి నిన్ను తన్నినపుడు నీకు అర్థం కావాల్సింది. సముద్రాలు పొంగి సునామీలు వచ్చినపుడు వాస్తవం లోకి రావాల్సింది. భూతాపాలు పెరిగి, ఎండలు మండి ఋతువులు గతి తప్పినపుడు, అడవులు కార్చిచ్చు తో కాలినపుడు, నువ్వు తేరుకోవాల్సింది - నువ్వు ప్రమాదం లో ఉన్నావని, దాన్ని కొనితెచ్చుకున్నావని.ఇక చాలు, ఇదికాదు జీవితం, ఇలాకాదు బతకడం.. లేదంటేనువ్వు ఇప్పుడు ప్రయాణించాల్సింది ఒక రోజో, వారమో, నెలనో ఉండి నిన్ను కలవరపరచిన ప్రకృతి బీభత్సలతో కాదు, నీవు కాదన్న ప్రకృతి పుట్టించిందో, నీవే పుట్టించావో కానీ నీతో అంటుకొని వస్తానట్టుంది Covid19 అంటువ్యాది.ఇక నువ్వు కాదన్నా, వద్దన్నా, ఎమన్నా సరే నువ్వు ప్రయాణించాల్సింది ఈ కరోనా తోనే. నీ నెత్తిన ఈ ముళ్ల కిరీటాన్ని భరించాల్సిందే. దానికోసం మందో మాకొ పుట్టేదాకా,నువ్వు మనిషి నుండి మనీషి గా మారేదాకా అందాక ఈ కరోనా తో suffer తప్పదు. నీకు కరోనా తో सफर తప్పదు.
June 29, 2020 • T. VEDANTA SURY • News