ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఒక చిన్ని ప్రయత్నం, తల్లిదండ్రుల ప్రోత్సాహం,బాలల్లోని ప్రతిభను వెలికితీసే పెద్దల ఉత్సాహం రెండు తెలుగు రాష్ట్రాల పిల్లలను తెలుగు భాషా మాధుర్యాన్ని ఆస్వాదించేలా చేసాయి.విజయనగరానికి చెందిన బండారు చిన్నారావుగారు స్థాపించిన బండారు బాలానంద సంఘం,అంతర్జాలం వేదికగా కథాపఠనం , పద్యపఠనం పోటీలు నిర్వహించారు.అందులో బాలగేయాలతో మనందరినీ అలరింశజేసిన చిన్నారి శ్రీనికేతన్ ప్రథమస్థానంలో,అదే స్థాయిలో ఉత్సాహాన్ని కనబరిచిన బంగారుతల్లి లాస్యప్రియ ద్వితీయస్థానం పొందడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.వీరితోపాటు మా పాఠశాల విద్యార్థిని శృతి ప్రశంసాపత్రాన్ని అందుకోవడం ఆనందదాయకం...ప్రస్తుత పరిస్థితుల్లో కూడా విజేతలందరికీ కొరియర్ ద్వారా బహుమతులు,ప్రశంసాపత్రాలు అందజేయడమే కాకుండా, పిల్లలను మంచివైపు పయనింజేస్తూ ప్రోత్సహిస్తున్న బండారు బాలానంద సంఘం వారికి కృతజ్ఞతలు. చిన్నారులందరికీ అభినందనలు........పద్మ త్రిపురారి.
June 15, 2020 • T. VEDANTA SURY • Talent