ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఒక రోజు : వేంపల్లి గంగాధర్
September 5, 2020 • T. VEDANTA SURY • News

బడికి ఆకస్మికంగా కలెక్టర్ గారు వచ్చారు.
కాస్త దూరం లో ఉన్న కానుగ చెట్టు కింద కారు ఆపి 
నడుచుకుంటూ బడిలోకి  ప్రవేశించారు.
పదవ తరగతి విద్యార్థులు ఉన్న గది లోకి వెళ్లారు.
నవ్వుతూ పిల్లల్ని  పలుకరించారు.
'నేను కలెక్టర్ గా ఎలా అయ్యానో తెలుసా ? అని  ప్రశ్నించారు.
పిల్లలందరూ భయం తో నిశ్శబ్దం గా ఉన్నారు.
'' తరగతి గది లో ఉపాధ్యాయుడు అందరికీ ఒకేసారి  పాఠం చెప్తాడు. ఆ పాఠం అందరం ఒకేసారి  వింటున్నాం .
క్లాస్ లో ఫస్ట్ వచ్చే విద్యార్థికి , అదే క్లాస్ లో ఫెయిల్ అయ్యే విద్యార్థికి కూడా అదే   ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నాడు. నేను బాగా విన్నాను కాబట్టి ఈ రోజు కలెక్టర్ అయ్యాను. సరిగ్గా వినకుండా కాలం గడిపిన 
నా స్నేహితులు  ఇప్పుడు బాధ తో పశ్చత్తాప పడుతున్నారు. ఊరు వెళ్ళినప్పుడు వచ్చి నన్ను కలిసి ఆ రోజుల్ని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు.అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి. మీరు సినిమా ఎంత ఆసక్తిగా చూస్తారో  అంతే ఆసక్తిగా పాఠం వినండి.'' అని విద్యార్థులకు తన మాటలు చెప్పారు ఆత్మీయంగా.

2
టీచర్స్ డైరీ, లెసెన్ ప్లాన్ , మార్కుల రిజిస్టర్ , చార్టులు,రికార్డులు...వంటి తదితర వాటిని టేబుల్ పైన వారి పరిశీలనకు ఉంచారు హెడ్ మాస్టర్ .
చికాకుగా ముఖం చిట్లించుకున్నారు కలెక్టర్ గారు ...' వీళ్ళందరూ పిల్లలకు పాఠాలు చెప్పడానికి  రిక్యూట్ అయ్యి వచ్చిన టీచర్స్ అండి ! రికార్డ్ అసిస్టెంట్ వర్క్ అంతా వారితో  చేయిస్తే ఎలా...వారిని పాఠాలు బాగా చెప్పనీయండి.' అని సున్నితంగా చెప్పారు.

(అప్పట్లో కడప జిల్లా  కలెక్టరు గా పనిచేసిన జయేష్ రంజన్ గారికి  కృతజ్ఞతలతో...)

ఉపాధ్యాయదినోత్సవ  శుభాకాంక్షలతో ...-డాక్టర్ వేంపల్లి గంగాధర్ 

ఫోటో ; రాష్ట్రపతి భవన్ లో దర్భార్ హాల్ కు ఎడమ వైపు ఉన్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్  గారి కాంస్య విగ్రహం .