ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఓ సింధూరమా : జయంత్ నమిలకొండ
August 24, 2020 • T. VEDANTA SURY • Poem

ఓసిందూరమా! నీకాంతులు
ప్రసరిస్తే చాలు
ఎల్లలోకాలకూ క్షేమమేగదా!

బ్రహ్మాండమంత చూడగా
అణువణువులంత పులకరింతలీయగా
కోటివెలుగులో భానుడే సంబరాలే
వెదజల్లుతూ నిత్యవేడుకల సిరులతో
స్వాగమై వచ్చేనదే జీవన్ముక్తేనీయగా.

శుక పిక జాలములే అనంతకోటి
స్వనములతో సుప్రభాత గీతాలే పలికేలే
ఏడేడు లోకాలలో వేదనాదాలనదాది
సంద్రములే ఓంకారఘోషలై స్వాగతాలైపిలిచేలే.

ఓసిందూరమా! నీవేఆదిశక్తిరూపమూ
నీచూపులే విశ్వశాంతి నిచ్చే ప్రసరములే
నేడు పుడమికి పట్టిన కరోన క్రిమినే
నాశనమే చేయ చల్లని దీవనగా ప్రభవించవే.