ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఓ...మహిళా నీకు నమోస్తు..: కిరణ్ కుమార్ చిటికెన
October 5, 2020 • T. VEDANTA SURY • News

మాతృస్వామ్యంలో అవతరించి పితృస్వామ్య వ్యవస్థకు మారింది దేశీయ సంస్కృతి. మహిళల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. పురుషాధిక్యత పెరుగుతోంది. గతంలో ఎవరింట్లోనైనా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయేవారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటి భావిస్తున్నారు. ఆడపిల్లలైతే చదువులు, కట్నాలు ఇచ్చి వివాహం చేయాలని అనంతరం ఏ సమస్య తలెత్తినా తామే పరిష్కరించాల్సి వస్తుందని తల్లిదండ్రులు భావించడంతో ఆడపిల్లల పై ప్రేమానురాగాలు తగ్గాయి. ఇదే తరుణంలో మగపిల్లల పై మోజు పెరిగింది. విద్యాబుద్ధులు నేర్పిస్తే ఉద్యోగం చేసి తమను పోషిస్తాడని అంతేకాక లక్షలాది రూపాయల కట్నం తెస్తాడని, తమను పున్నామ నరకం నుండి రక్షిస్తాడని భావించారు. దీంతో తల్లి గర్బంలోనే పిండం ప్రాణం పోసుకుంటున్న దశలో స్కానింగ్‌లు తీయించి పాప అయితే గర్భవిచ్ఛిన్నం చేయించుతున్నారు.
•             ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను క లిగి ఉన్న భారత్‌... స్త్రీ, పురుషులను సమానంగా చూసేవిషయంలో మాత్రం అట్టడుగున ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన సూచి వెల్లడించింది. భారత్‌లో ఆడ శిశువులను గర్భంలోనే చంపేస్తున్నారని, 2.5 కోట్ల మంది ఆడపిల్లలు భూ మ్మీదకు రాకముందే హత్యకు గు రయ్యారని నోబెల్‌ బహుమతి గ్ర హీత అమర్త్యసేన్‌ వెలిబుచ్చిన ఆందోళనలను ఇది నిర్ధారించింది. 134 దేశాలపై రూపొందించిన ఈ సూచిలో భారత్‌ 114వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌, శ్రీలంక, నే పాల్‌ దేశాలు సైతం ఈ సూచీలో భారత్‌ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.[3]
•         పురుషులతో పోలిస్తే మహిళలకే వ్యవసాయ భూములు తక్కువగా ఉన్నాయి. చాలాచోట్ల అసలు మహిళలకు వ్యవసాయ భూమి అనేదే లేదు.. తమ పేరుమీద వ్యవసాయ భూములున్నవారు మనదేశంలో మొత్తం 119 లక్షల మంది ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 9.21 శాతంగా మాత్రమే
               తెలుగు సాహిత్యంలో రెండు ఉద్యమాలు వ్యాప్తిచెందాయి. అందులో ఒకటి స్త్రీవాద ఉద్యమం లేదా స్త్రీవాదం... స్త్రీవాద ఉద్యమం సాహిత్యానికి పరిమితమై స్త్రీలకు సామాజికపరమైన న్యాయం కోసం మొదలయ్యాయి.
       భారతదేశ జనాభాలో సగంమంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీ సమాజంలో మోసగింపబడుతోంది. కేవలం ఒక పనిముట్టుగా చూడబడుతుంది. వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండటం లేదు.. వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు. అన్ని చోట్లా పురుషాధిక్యత తాండవిస్తోంది. కాబట్టి స్త్రీకి సాంఘిక న్యాయం చేకూరాలని స్త్రీవాదం బయలుదేరింది.