ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔను నేను పుస్తకమే : చిటికెన కిరణ్ కుమార్
September 5, 2020 • T. VEDANTA SURY • News

 రవి కాంచని చోట కవి గాంచును అని ఒక  సూక్తి ఉన్నది దానిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని ప్రకృతిలోని ప్రతి అందాన్ని వర్ణించే శక్తి గ్రహించే కోణం అతి దగ్గర నుంచి వీక్షించే మార్గం రచయితకు మాత్రమే ఉంటుంది.    ఒక కథ కన్నీళ్లు పెట్టించ గలదు మరోకథ కన్నీళ్లను తుడవగలదు. నేటి కథనే రేపటి భవితకు రూపం. రేపటి రూపానికి బాసటనే  నేటి కథ
   తెలుగు కథ లేదా కత 
           ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం.... . దేశంలో చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను, ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించబడినట్లుగా ఒక అంచనా. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రించబడుతున్నాయి. ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు
  కథ కి     ప్రధాన వస్తువుగా నడుస్తాయి. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథకి ఆదరణ ఎక్కువ.
        ఏ కథ కైనా ప్రాణం “ కథా వస్తువు ”