ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔను నేను పుస్తకమే...చిటికెన కిరణ్ కుమార్
September 9, 2020 • T. VEDANTA SURY • News

కథ... కథా వస్తువు.... (  5 వ. భాగం )
తెలుగు కథ - లక్షణాలను వివిధ రకాల పండితులు, కథకుల అభిప్రాయం ప్రకారం ఈ క్రింద విధంగా తెలియజేయబడింది
• బొడ్డపాటి కుటుంబరాయశర్మ - సాధారణంగా నాతి విస్తృత క్షేత్రము కలిగి, ఒకానొక సంవేదనముతో కూడి, స్వయం సంపూర్ణమై, దానిలోని విభిన్న తత్వములను ఏకోన్ముఖముగ చూపు ఇతివృత్తాత్మక గద్య కవితా శిల్పఖండమును కథానిక అనవచ్చును.
• జె. నాగయ్య - ఒకానొక ఎత్తుగడ, నడక తీరు, ముగింపు, పరిమిత పాత్రలు, ఆపాత్రలకు తగు పోషణ, వస్తువిన్యాస వైశిష్ట్యము, ఒక జీవిత సత్యమును ప్రతిపాదించుట, అన్నింటిని మించి వస్త్వైక్యమునుండి వినోదమో, విజ్ఞానమో, వికాసమో కలిగించగల చిన్న కథ కథానిక.
• పోరంకి దక్షిణామూర్తి (కథానికా వాఙ్మయం) - కథానిక ముఖ్య లక్షణాలు : సంక్షిప్తత, ఒకే అంశం లక్ష్యంగా ఉండడం, మనసు లగ్నమయ్యే లక్షణం (ఏకాగ్రత, నిర్భరత), స్వయంసమగ్రత, సంవాద చాతుర్యం, అసలు
• విషయాన్ని లక్ష్యంనుండి తప్పకుండా ఉంచడం (ప్రతిపాద్య ప్రవణత), పాఠకునిపై చూపే ప్రభావం గురించిన ఎఱుక (ప్రభావాన్విత)
"మంచి కథ" గురించి చెప్పిన అభిప్రాయాలు
• పోరంకి దక్షిణామూర్తి - జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్పనైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లు చూపించి, హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతితో నింపి, పదే పదే చదవాలనిపింపజేసేది గొప్ప కథ.
• వాకాటి పాండురంగారావు - ఒక కథను చదివిన తరువాత మనసు చలించాలి. మళ్ళీ చదివింపజేయాలి. ఈ కథ బాఘుంది అని పదిమందికీ చెప్పించ గలగాలి. మళ్ళీ పదేళ్ళో, ఇరవై యేళ్ళో పోయిన తరువాత చదివినా అదే అనుభూతి, స్పందన కలగాలి. అప్పుడే అది గొప్ప కథ అవుతుంది.
    రచన ప్రక్రియల గురించి వివిధ రకాల విషయాలు తెలుసుకున్నాం కదా.....