ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔను.. నేను పుస్తకమే... చిటికెన కిరణ్ కుమార్
September 8, 2020 • T. VEDANTA SURY • News

 కథ కథనాల గురించి పరిశీలించినట్లయితే... ఈ క్రింది విధంగా కొన్ని అధ్యయనాల మేరకు లభించిన సమాచారం.కథ...కథనం 
...............
 కథలు చెప్పేవాడిని 'కథకుడు' అంటారు. 
కథలో ప్రధాన పురుషుడు 'కథానాయకుడు', 
ప్రధాన స్త్రీ 'కథానాయకురాలు'. కీర్తిశేషుడైన లేదా మరణించిన పురుషుడు 'కథాశేషుడు', 
మరణించిన స్త్రీ 'కథాశేషురాలు'.
బ్రౌన్ నిఘంటువు ప్రకారం.... 
కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధము.  
కథ చెప్పువాడిని "కథకుడు" అని
 కథ చెప్పే విధానాన్ని "కథనము" అని చెప్పే విషయాన్ని "కథితము" అని అంటారు.
అగ్నిపురాణంలోని ఒక శ్లోకంలో "దీర్ఘంగా కాక పొందికగా ఉండడం, ఉదాత్తత కలిగి ఉండడం, సంభ్రమాశ్చర్యాలు కలిగించి కరుణ అద్భుత రసాలను పోషించడం, ఆనందాన్ని కలిగించడం కథానిక లక్షణాలు" - అని చెప్పబడింది.