ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔషధ జ్ఞానం ..: --చీకట్లసంగీత--జగిత్యాల.
November 5, 2020 • T. VEDANTA SURY • Poem

రోజంతా ఉరుకుల 
పరుగులజీవితం,
అం తాహడావిడి,
 ఉద్యోగాలపరుగులు,
అందుకు కావాలి-
 విశ్రాంతి!

ఎన్నో సవాళ్లతో-
నిండినసమస్యలు ,
వాటితో వేగలేక
 తలనొప్పులు,
అందుకు కావాలి
 ప్రశాంతత....!

తినడానికి కూడా 
తీరికాలేనిపనులు..
అందుకే అలసిన దేహానికి
కావలి నిద్ర....!

మనిషికి దేవుడిచ్చిన
వరం నిద్ర....
మెదడు విశ్రాంతికి,
మనిషి  ఆరోగ్యానికి
 ఔషధం ....
అందిస్తూంది నిద్ర!
అందుకే---
అవసరానికి సరిప డా,
హాయిగా నిద్రించాలి!
ఆనందంగా జీవించాలి!!