ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔ మల్ల!-- గా జమాన్ల నె మంచిగుండె. అవునుల్లా! గీ రాకిట్ల పండుక్కు అక్క సెల్లెండ్లు ఎంత దూరం ల ఉన్న గని తప్పకుంట తల్లిగారింటికి అచ్చేటోల్లు అన్నదమ్ములకు రాకిట్లు కట్టి సెక్కెరో, మైసూర్పాకో నోట్లో పోసేటోల్లు అన్నదమ్ములు ఏం పెట్టినా పెట్టక పోయినా దీవెనార్తి ఇచ్చిటోల్లు సంబుర పడుకుంట అచ్చి పోయె టోల్లు! మా దేవక్క గుడ రుద్రంగి నుండచ్చి నాకు నా తమ్ముడికి రాకీలు కట్టేది. మా తమ్ముడు నేను మా అక్క కాళ్ళు మొక్కితే "సల్లంగ బతుకుండ్రి " అని దీవెనార్తి ఇచ్చేది ఏం పెడితే అది తీసుకునేద ఏం పెట్టక పోయినా పెద్ద మనసుతో ని " నౌకరీ అచ్చినంక అయిదు వందల సీర వెడుదురు తియ్యుండ్రి " అని సెప్పి మనుసు నింపుకునేది. గట్లనే మా సెల్లేండ్లు ( మా చిన్నవ్వల బిడ్డలు ) గుడ అచ్చి రాకీల్ కట్టేటోల్లు కలిగింది ఇత్తే , ఇచ్చింది తీస్కొని " మీ లగ్గాలకు మంచి సీరెలు వెట్టాలే " అని అనేటోల్లు గని నారాజు అయేటోల్లు గాదు. అక్క సెల్లెండ్లవి సొక్కం బంగారమసొంటి మనుసులు. అన్నదమ్ములు గుడ అక్కాసెల్లెండ్లను పానమోలే సూసుకునేటోల్లు అక్కసెల్లెండ్లు ఆపతికి,సంపతికి ఉరికచ్చేటోల్లు మనిషి అత్తగారింటికి కాడున్నా మనుసు మాత్రం అవ్వగారింటి కాడనే ఉండేటిది ఏ ఇంటికయిన గని ఆడివిల్లలే అందము. గదేందో గని అక్కాసెల్లెండ్లు లేని అన్నదమ్ములకు ఎన్నున్నా ఎల్తిగనే ఉంటది. ఏ పండుగలచ్చిన ఆడివిల్లలు అత్తెనే పండుగ లెక్కుంటది ఔ మల్ల! - బాలవర్ధిరాజు మల్లారం
August 3, 2020 • T. VEDANTA SURY • Memories