ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔ మల్ల!--- బాలవర్ధిరాజు మల్లారం నువద్దిగనే సుట్టూ పది,ఇరువై ఊర్ల పెట్టు మా ఊరంటే మంచి పేరుండేదట పాడి, పంట ఎక్కువగ వుంటదని, బతుకు దెరువు మంచిగుంటదని రామ సక్కదనాలసొంటి మనుసులని మాటంటే మాటేనని మాట మీద ఉంటరని "మాటల మల్లార"మని అనుకునే టోల్లట. ఏ కాలంల అయిన సరే! మా ఊరు అనంగనే కడుపు నిండా బువ్వ దొరుకుతదని బబ్బిలోల్లు, సాదనా సూరులు సిందోల్లు, కోతులోల్లు పాములోల్లు, పెద్దమ్మలోల్లు దొమ్మరోల్లు, తుపాకి రామడు సంబుర పడుకుంట మా ఊరికి అచ్చే టోల్లట ఆడుకుంట, పాడుకుంట ఆల్ల ఇద్దెలన్నీ సూపిచ్చి అడుక్కునేటోల్లట గంతే కాదుల్లా! పక్కూర్ల నుంచి గుడ అరేసుటానికో, అరి గోసుటానికో మట్టి పనికో ,ఏదో వొక పని సేసుటానికో అచ్చేటోల్లట గట్ల మా ఊరికి అచ్చినోల్లందరికి సేతి నిండా పని దొరికేదట కడుపు నిండా బువ్వ తినేదట గందుకనే మా ఊరంటే పది, ఇరువై ఊర్ల పెట్టు మంచి పేరుండేదట! ఔ నుల్లా! ఔ మల్ల!
July 28, 2020 • T. VEDANTA SURY • Memories