ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔ మల్ల!--- బాలవర్ధిరాజు మల్లారం--- నోరు మంచిదైతే ఊరు మంచిదైతద'ని శాత్రం ఉంది గదుల్లా! మా ఊరోల్ల నోరు మంచిదే; ఊరూ మంచిదే. నువద్దిగనేనుల్లా! ఎనుకటి నుంచి గిప్పటి దాక మా ఊరోల్లు ఏ ఊరోల్ల జోలికి వోలె ఆర్తకు వోలె ఏ ఊరోల్లను తిట్టలే, కొట్టలే మల్లారమంటే మంచి తనానికి మారు పేరుల్లా! బతుకు దెరువున్న ఊరుల్లా!! రామ సక్క దనాలసొంటి మనసులు మాయా మర్మం లేని, కల్లా, కపటం తెల్వని మనుషులు గీ మాట నేను అనుడు కాదుల్లా! మా ఊరు సుట్టు ముట్టు ఇరువై, ముప్పై ఊర్లోల్లు అనుకునే మాట! మా ఊరికి ఎవలన్న అత్తే అడిగినొల్లకు సాయం జేసుడు మా ఊరికలవాటు గట్ల మా ఊరికి అచ్చినోల్లు, బతుకచ్చినోల్లు శానా మందే ఉన్నరు గీ మాట నేను అనుడు కాదుల్లా! మా ఊరు సుట్టు ముట్టు ఇరువై, ముప్పై ఊర్లోల్లు అనుకునే మాట! ఔ మల్ల!
August 19, 2020 • T. VEDANTA SURY • Memories