ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔ మల్ల! ---------- ఎనుకట తాము ఎంత ప్యాదోల్ల మైన గని, తాము సదువు కోకున్న తమ కొడుకులు, బిడ్డలు మాత్రం బగ్గ సదువుకొని, బుద్ధిమంతులై పేరుకు రావాల్నని ఏ తల్లిదండ్రికైన అనిపిచ్చేదట! గందుకోసం నాకు ఐదేండ్లు నిండినంక మా నాన గుడ నన్ను మా ఊరి బడిల ఏసిండట బడిల నన్ను కూకోవెట్టి మా నాన ఇంటికచ్చే సరికి నేను ఇంట్లో ఉండేటోన్నట! దినాం గిట్లనే బల్లే కూకోకుండ ఇంటికి అత్తున్న నని ఓ సగం పొంటే మా నాన నాతోనే బల్లె కూకున్నడట! ఇగ తెల్లారి నుంచి దినం తప్పకుంట నేను బడికి పోయిన్నట! గా బల్లే సెంకరయ్య సారు అంకులు, ఓనువాలు పెట్టిచ్చిండట మా ఇంట్ల మా నాన గుడ పలక మీద బలపం బెట్టి ఓనువాలు,అంకులు బగ్గ దిద్దిపిచ్చిండట సదివి పిచ్చిండట ఒకటి,రెండ్లు గుడ నేర్పిచ్చిండట ఏక్,దో తీన్ అని ఇంది అంకులు సుత సెప్పిండట మా నానకు నేను బగ్గ సదువు కోవల్నని ఆపెచ్చన శానా ఉండేదట గందుకనే ఇంట్ల సదువు సెప్పెటోడట గట్ల సేసే వట్కెనే నేను నా తోటోల్ల కంటే ఒక తరగతి ముందుగాల వోయిన్నట. అయ్యవ్వ మాట ఇన్నో డు ఈ లోకంల సెడి పోలేదు ఔ మల్ల! - బాలవర్ధిరాజు మల్లారం
August 2, 2020 • T. VEDANTA SURY • Memories