ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔ మల్ల! ---------- మా ఊర్లె నా సిన్నప్పుడు పెసరి కాయల్ను,బిల్లి బిసరి కాయల్ను పల్లి కాయల్ను,సెనగ కాయల్ను కంది కాయల్ను,దోస కాయల్ను బబ్బెర్లను ,అలిసెంత కాయల్ను పచ్చి పచ్చిగనే తినేటోల్లం గివ్వే గాదుల్లా ఇంక... జామ కాయల్ను ,రేగ్గాయల్ను సింత కాయల్ను, సివసింత కాయల్ను , ఓన గాయల్ను,అల్లనేరేడి పండ్లను మొర్రి పండ్లను ,జీడి పండ్లను మాడి పండ్లను ,కలమాడి పండ్లను సితవల్క పండ్లను ఈత పండ్లను,ఈత గడ్డల్ను తాటి ముంజల్ను తాటి గడ్డల్ను కంద గడ్డలను, గిట్ల మా ఊర్లె ఏ కాలం ల గాసిన కాయల్ను ,పండ్లను గా కాలంల దొరికినయ్ దొరికినట్టు తినేటోల్లం! గదేందో గని ఇంట్ల ఉన్నగని వేరే వాల్ల సేండ్లల్ల కోయి దొంగతనం జేసి తెచ్చుకొని తింటుంటే గా రుసే మంచిగనిపిచ్చేది ఔ మల్ల! -బాలవర్ధిరాజు మల్లారం
July 31, 2020 • T. VEDANTA SURY • Memories