ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం
August 29, 2020 • T. VEDANTA SURY • Memories

మా మల్లారం 
ఒక్క పాడి పంటలకే కాదుల్లా, 
ఆట పాటలకు మంచి పేరుండేది.
మా ఊల్లె ఇంటికొక్క 
ఆటగాడు,పాట గాడు, ఉండేటోడు
దసుర, ఇనాయక చెవితికి
నాటకాలు,బాగోతాలు ఆడేటోల్లు
అంతే గాదుల్లా
ఎక్కడి నుంచో 
తోలు బొమ్మలాట లోల్లు  అచ్చి
అందరు తిన్నంక రాతిరి అయినంక
ఒక గోడ దగ్గర తెల్లని పరద  గట్టి
ఇద్దరో, ముగ్గురొ లోపలుండి
సేతి ఏళ్ళకు  దారాలతో 
తోలు బొమ్మలను కట్టుకొని, 
పాటలు పాడుకుంట
తోలు బొమ్మలను ఆడిచ్చేటోల్లు.
సూత్తే ఇసిత్రంగ అనిపిచ్చేది
ఇంక సిందొల్లు, గ్యారడోల్లు, బబ్బిలోల్లు
ఒగ్గొల్లు, బుర్ర కత సెప్పేటోల్లు
సాదనా సురులు,పెద్దమ్మలొల్లు 
పాములొల్లు, కోతులోల్లు, దొమ్మరోల్లు
బాల సంతోల్లు, బుడబుక్కలొల్లు , 
మాట్టోల్లు,గుర్రపోల్లు, దక్కలోల్లు 
తుపాకి రామడు గుడ అచ్చి 
ఆళ్ళ  ఆళ్ళ ఇద్దెలు సూపిచ్చేటోల్లు.
ఎంతిత్తే అంత తీసుకునేటోల్లు
మా ఊరోల్లది పెద్ద సేయుల్లా.
గట్ల మా ఊరికి అచ్చి నోల్లకు 
ఎవ్వరైన సరే!
కడుపు నిండ బువ్వ వెడుతరు
అడిగి నన్ని అడ్లో, పైసలో ఇచ్చి పంపిత్తరు

ఇగ సుట్ట పోల్లత్తే
కోడిని కోసి, కల్లు దెచ్చి
మక్క గుడాలోసెనిగ గుడాలో 
అనుప గుడాలో, పెసరి గుడా లో ఏసి
మంచిగ అరుసుకొని పంపిత్తరు
గీ తీరు గుంటది మా ఊరి మరియాద
అచ్చినొల్లు సంబుర పడుకుంటనే వోతరు.
మా ఊరు పచ్చగనే ఉంటది
మా తీరు మంచిగనే ఉంటది
ఔ మల్ల!