ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔ మల్ల,--బాలవర్ధి రాజు - రైతు కొడుకు ఎవుసం పని నేర్సి రైతు అయినట్టు గా సాలె మల్లయ్య కొడుకు మోయిన్ దాస్ గుడ దాక్ దార్ పనే నేర్సి దాక్ దార్ అయి మేరె సామి ఇంట్ల దావకాన వెట్టిండు ఆల్ల బాపు లెక్కనే గీ ముచ్చట నలబై ఏండ్ల కింద దు ల్లా గీ మోయి న్ దాసే మొదాలు మొదాలు డబుల్ గేర్ కేస్ సైకిల్ కొనుక్కచ్చు కున్నడు దాని దర ఎంతను కున్నరు? నూరో, ఇన్నూరో, మున్నూరో గాదుల్లా ఆరు వందల రూపాయలు మా ఊల్లె గంత దర వెట్టి ఎవ్వలు గుడ సైకిల్ కొనలేదు గా సైకిల్ గావల్నని ఎస్.దేవయ్య ఏడిత్తే దాన్ని ఎస్. దేవయ్య కు అమ్మి మోయిన్ దాస్ లూన కొన్నడు అటెనుక ఎన్నో బండ్లు కొన్నడు, అమ్మిండు గట్ల కొత్త కొత్త అస్తువలు కొనుట్ల మోయిన్ దాస్ తరువాతే ఎవలైన గదొక్కటే కాదుల్లా నాకు తెలిసి అంటుడు,ముట్టుడు లేని మొదటి మనిషి గితనే. సదువూ, సాత్రం తెలిసినోడు కులం,మతం పట్టిచ్చు కోనోడు గసొంటి మంచి మనిషి తోని సోపతి కల్సింది మా కులాలు ఏరే అయిన గని నన్ను ఆల్ల బామ్మర్ది సత్తె నారాయణ లెక్కనే సూసే టోడు,ఇజ్జక్క కుడుక నన్ను సొంత తమ్మునోలే సూసేది నలబై ఏండ్ల సంది ఇప్పటికీ గుడ గా,మా సోపతి గట్లనే ఉన్నది. గిదంత ఆల్ల మంచి తనమేనుల్లా! మా మల్లార పోల్ల సోపతులు గిట్లనే వుంటయి. ఔ మల్ల!
August 17, 2020 • T. VEDANTA SURY • Memories