ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔ మల్ల--- గీ జెండా వందనం అత్తుందంటే సిన్నప్పుడు బగ్గ సంబురమని పిచ్చేది ఆరం, పద్దినాల ముందే మా అవ్వ ఎములాడ కోయి కొత్త గోదుమ రంగు లాగు బట్ట, తెల్లంగి బట్ట కొనుక్కచ్చి అంగి, లాగు కుట్టుమని మేరె సామికిచ్చేది. గదేమి ఇచ్చింత్రమో గని మనిషి ముందు లేకున్నా మాపు తీసుకోకుంటనే ఎన్నేండ్లు ఉంటయని అడిగి మనిషికి దగ్గట్టు కుట్టేటోడుల్లా. గీ జెండా వందనం రోజు ఎగిలి వరంగనే లేసి మా అవ్వ పొయి అంటువెట్టి నీళ్ళు కాగవెట్టేటిది ఉదుకుడుకు నీళ్ళతో తానం జేసి కొత్త బట్టలేసుకుని బడికి ఉరికేటోన్ని బల్లె జెండ వందనం ఆయినంక ఇద్దరిద్దరం చేతులు వట్టుకొని బడి పిల గాండ్ల మంతా ఊరంత తిరిగె టోల్లం కుల సంగపోల్లు ఎవల ఆడ కట్టుకు ఆల్లు జెండాను నిలవెట్టి గాంది తాత, నెహురు పోటువలు గుడ కుర్సి మీద వెట్టి బడి పిల్లలచ్చినంక కులసంగ పెద్ద మనిషి జెండ ఎగిరేసి కొబ్బరి కాయ కొట్టేటోడు బడిపిల్లలకు పలారమని చెక్కరి గోలీలు, చిన్న బిస్కెట్లు ఇచ్చేటోల్లు గట్ల అన్ని కుల సంగాల దగ్గరికి వోయేటోల్లం ఇంటికచ్చి బుక్కెదంత బువ్వ దిని మల్ల బడికి ఉరికే టోల్లం బల్లె సార్లు ఆటల పోటీలు పెట్టే టోల్లు కప్ప దుంకుడు, ఉరుకుడు, లాంగ్ జెంప్, మూడు గాల్ల పరుగు, సంచి పరుగు, కబడ్డీ,కోకో , ఆటలు ఆడిపిచ్చే టోల్లు గెలిసి నోల్లకు ప్రైజులు ఇచ్చే టోల్లు ఒక్క బడి పిల్లలే కాదుల్లా కుల సంగాలోల్లు గుడ కబడ్డి, ఊరుకుడు, ఆలి బాల్,క్యారమ్, బ్యాట్ మెంటిన్ ఆడే టోల్లు పొద్దు గూకి నంక అన్మండ్ల కాడ ప్రైజులు పంచేటోల్లు. ఆకరికి పాటల పోటీ గుడ ఉండే దుల్లా. గా పాటల పోటీల 'షోలే 'హిందీ సినిమాల 'గబ్బర్ సింగ్ ' డైలాగులు కొట్టినందుకు కొంపల్లి నర్శయ్యను గప్పటి నుండి గబ్బర్ అనే పిలుసుడు మొదలు వెట్టింద్రు. ఇప్పటికీ గుడ నర్సయ్య ను ' గబ్బర్ ' అనే పిలుస్తుంది మా వూరు ఇగ గా దినం వూరిలే సరిగ ఎవలు గుడ పనికి పోయెటోల్లు గాదు ఊరంత పండుగ లెక్కనే ఉండేది ఔ మల్ల! - బాలవర్ధిరాజు మల్లారం
August 15, 2020 • T. VEDANTA SURY • Memories