ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కంటి వెలుగులు..--మహమ్మద్ అఫ్సర్ వలీషా , ద్వారపూడి ,తూ.గో. జి.8500597116
September 30, 2020 • T. VEDANTA SURY • Poem

ముద్దొచ్చే ముద్ద మందారంలో 
అరవిరిసిన గులాబీలో
అరచేతిన పండిన గోరింటాకులో...

ఘల్లు ఘల్లు మనే
కాలిఅందియల చప్పుళ్ళ లో
ఆడపిల్ల అందం
కనపడుతుంది అరవిరిసి...

ఆడపిల్లలు ఇంటికి దీపాలు 
కంటికి వెలుగులు
సిరుల మాణిక్యాలు 
ఆనందాలకు నిలయాలు....

అమ్మా నాన్నలకు భరోసాలు
అత్తా మామలకు ఆసరాలు
అన్నాదమ్ములకు అండ దండలు
భర్తకు తోడూ నీడా ఆడపిల్లలు....

ఆడపిల్ల ఉన్న ఇల్లు
అష్టైశ్వర్యాల పొదరిల్లు
ఆమె నవ్వులు ఇంటికే
హరివిల్లులు
ఆమె మాటలు పన్నీటి జల్లులు....
 
ఆమె పుట్టినింట ఉన్నా మెట్టినింట ఉన్నా 
పలుకును సంతోషాల సరాగాలు ఎవరు 
ఔనన్నా కాదన్నా....!!