ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కంటి సమస్యలు- నివారణ -1- పి . కమలాకర్ రావు
August 21, 2020 • T. VEDANTA SURY • health tips

మనకు ఏ కారణం చేతనైనా ఏడుపు వస్తే వెంటనే మనకు కన్నీళ్లు వస్తాయి. బాధ తీవ్రతను బట్టి ఏడుపు ఎక్కువగా వస్తుంది. మనకు వచ్చే కన్నీటిని బలవనతంగా ఆపకూడదు . బాగా కళ్ళల్లో నుంచి నీరు కారిన తరువాత గుండె బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. బాగా ఏడ్చి కన్నీరు కార్చే వారికి ఛాతీ సంబంధమైన సమస్యలు , గుండె సమస్యలు చాలా తక్కువగా వుంటాయని పరిశోధనల్లో తేలింది కన్నీటిని ఆపితే అది జలుబుగా మారి కళ్ళలో నొప్పులు , మీద నొప్పి , తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకని సహజంగా ఏడుపు వచ్చినప్పుడు మాత్రం ఆప కూడదు . కొన్ని నంది వర్ధనం చెట్టు పూలు (తెల్లని రిక్క పూలు లేదా ముద్ద పూలు ) కడిగి నీటిలో వేసి రెండు గంటల తరువాత ఆ నీటిలో కళ్ళు కడుక్కుంటే కళ్ళలో మంట తగ్గి , తేటగా అవుతాయి. పూలు కంటిపై పెట్టుకుని చిన్న గుడ్డ కప్పి కొద్ది సేపు పడుకుంటే వెంటనే తగ్గి పోతుంది.