ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కందుకూరి వీరేశలింగం తన జీవితంలో అనేక కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యలను నిత్యం ఎదుర్కొంటునే తన రచనలను, పుస్తకరూపంలో తెచ్చారు. కేవలం తన రచనలే గాక సంఘ సంస్కరణ నిమిత్తం వివేకవర్ధని అనే పత్రిక‌ను, నిర్వహించడానికి కూడా అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అలాగే స్త్రీల సమస్యలను పరిష్కరించడానికి సతీహిత బోధిని అనే పత్రికను కూడా ప్రారంభించారు. వీటి నిర్వహణలో కొన్ని ఆర్థిక సమస్యలతో పాటు సామాజిక సమస్యలను కూడా ధైర్యంగా నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. సమాజ ప్రయోజనాన్ని కోరుకునే కొంతమంది మిత్రులు సహకారం పొందవలసి వచ్చింది. ఈయన తన జీవితాన్ని సాహిత్య, సమాజ సేవకు అంకితం చేశారు. ఈయన గొప్పతనం చాటే మరొక ఉదాహరణ ఉంది. కృష్ణాజిల్లాలోని తిరువూరు నుండి దర్భా బ్రహ్మానందం గారు, ఒక లేఖను కందుకూరి వీరేశలింగం గారికి రాశారు. విషయం ఏమిటంటే"మా తాలూకా లోని ఒక గ్రామం ఉంది. అక్కడ 12 ఏళ్ల వయస్సు గల బ్రాహ్మణ కన్య వితంతువు ఉంది. తగిన మనుషులను పంపండి తల్లిని ఒప్పించి అమ్మాయిని వారి వెంట పంపే ప్రయత్నం చేస్తాను కాస్త గుప్తంగా ఉంచండి". అని రాశారు దానిపైకొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. "ఆమెతో మాట్లాడాను మీ వద్దకు తన కూతురిని పంపడానికి ఇష్టపడింది. మీరు నమ్మదగిన మంచి మనుషులను ఇప్పుడే పంపించే ఏర్పాటు చేయగలరు. మీరు విషయాన్ని చాలా రహస్యంగా ఉంచగలరు" అని తెలియజేశారు.వితంతువు తల్లి కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. వచ్చినవారు, ఇద్దరి కంటే ఎక్కువ ఉండకూడదు, వాళ్లు ఎక్కడి నుండి వచ్చారు తెలియకూడదు. తల్లి తన సొంత కూతురు వివాహాన్ని తను అంగీకరిస్తు న్నట్లు అనుమతి పత్రం కూడా రాసిస్తానని తెలియజేసింది. అలాగే విషయం అంతా రహస్యంగా ఉంచాలని తెలిపింది. వీరేశ లింగం మనుషులు వచ్చేవరకు అమ్మాయిని తీసుకు వెళ్లే వరకు ఊరు విడిచి ఎక్కడికి పంపవద్దని వీరేశలింగంగారు చేశారు. ఈ విషయంలో ఆత్మూరి లక్ష్మీ నరసింహం గారు వీరేశలింగం గారికిసర్వవిధాలా సహాయ సహకారాలు అందించారు.కన్యను తీసుకు వెళ్లడానికి మనుషులు వచ్చారు ఈ పిల్లల కుటుంబం ధనికులు, గొప్పవారు. ఈ వివాహం, కన్య తల్లికి తప్ప మరెవరికీ ఇష్టం లేదు. ఈ విషయం ఊర్లో తెలిస్తే దౌర్జన్యానికి పాల్పడతారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో వీరేశలింగం మిత్రుడు బండి వానికి చెప్పకుండా ఆ వూరుకు తీసుకెళ్ళాడు.ఆ రాత్రి వేళ కన్య ఇంటికి చేరేసరికి తల్లి "బ్రహ్మానందం గారు రానిదే నేను పిల్లలను పంపను," అని చెప్పింది. వీరేశలింగం గారి మిత్రుడు ఆమెను ఒప్పించి, ఎలాగో శ్రమపడుతూ తెల్లవారకముందే రాజమండ్రి వీరేశలింగంగారి ఇంటికి చేర్చాడు. ఆ వార్త తెలిసి ఆ చిన్న దాన్ని చూడడానకి జనం అంతా గుంపులు గుంపులుగా వాళ్ళ ఇంటికి చేరారు.అప్పుడు కందుకూరి వారు వరాన్వేషణ ప్రారం భించారు. వారు వితంతు కన్య యొక్క పెండ్లి ప్రయత్నము ప్రారంభించినది, లగాయతు బ్రహ్మచారులైన విద్యార్థులను బ్రతిమాలి ఒత్తిడి చేసి పెళ్లిళ్లు చేయసాగారు. ఇక్కడ జరిగిన చాలా పెళ్లిళ్లు విజయవంతమయ్యాయి. అయితే కొద్ది మందిలో పనికిరాకుండా పోయాయి.వీరేశలింగం గారి ఇంట్లో ఉంటూ చదువుకున్న యువకునికి రక్షణ శాఖలో ఉద్యోగం లభించింది. 20 రూపాయలు నెలసరి జీతం కూడా,ఇరవై రెండేళ్లు వయస్సు గల, ఇతని భార్య అకస్మాత్తుగ మరణించడంతో ఈయన వితంతు వివాహానికి సిద్ధపడ్డాడు. ఈ యువకునికి పిల్లనిస్తామని ఎంతో మంది చుట్టూ తిరిగిన వితంతు వివాహానికి అంగీకరించి, కష్టాలను ఎదుర్కోడానికి సిద్ధపడ్డాడు. వీరేశలింగం గారు ఈయన ధైర్యసాహసాలకు, పరోపకార చింతనకు, మెచ్చుకున్నారు. ఆ వివాహానికి ఖర్చుల నిమిత్తం పైడా రామకృష్ణయ్య గారు వెయ్యి రూపాయలిమ్మని నాళం కామ రాజు గారికి తెలియశారు. ఆయన వెంటనే వెయ్యి రూపాయలు అందజేశారు. కానీ వివాహం జరిగే సమయానికి విశాఖపట్టణం మండలి రక్షక శాఖ అధ్యక్షుడు వరుడికి సెలవీయనని తెలియజేశారు. అందరూ వివాహం అవుతుందని అనుకున్నారు.ఆ సమయంలో కొంతకాలం గోదావరి మండలం రక్షణశాఖ అధ్యక్షుడైన కర్నల్ పోర్చస్ దొరగారు రక్షణ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. చెన్నపురి రాజధానిలో రక్షణశాఖ అంతటికి అధికారి (inspector general of police) గా ఉండడం వారు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ అభిమానంతో తన క్రింది అధికారి అయిన విశాఖపట్టణం రక్షణ శాఖ అధ్యక్షునికి వెంటనే సెలవు మంజూరు చేయమని టెలిగ్రామ్ ఇచ్చారు. వివాహానికి సిద్ధమయిన సమయంలో బంధువులు వచ్చి వివాహం చేసుకోవద్దని అనేక విధాలుగా బోధించారు. కాని వరుడు భయపడక వివాహానికి సిద్ధపడ్డాడు. వితంతు వివాహం జరుగుతుందనే విషయం రాజమండ్రి ఎంత వ్యాపించింది. ఎక్కడ చూసినా జనం గుంపులు కోపంతో మండిపోతున్న వారు మరియు కొందరు బెదిరింపులు చేశారు.ఈ వితంతు వివాహము 1881, డిసెంబర్ నెల 11వ తేదీన రాజమండ్రిలో వీరేశలింగం గారి నిర్వహణ లో మొట్టమొదటి స్త్రీ పునర్వివాహం జరిగింది‌. ఆరోజున వీరేశలింగంగారి ఇంటిలోనే కాక వీధి పొడవునా రక్షక భటలు కాపలా ఉన్నారు.వీరేశలింగం గారికి పులిగోరు పిన మిత్రుడు చల్లపల్లి బాబయ్య గారు ఈ వివాహానికి రానేలేదు. ఆయన రాకపోవడానికి కారణం ఎవరి దగ్గర భయపడి కాదు. ముందురోజే అన్నదమ్ములు అతనిని గదిలో పెట్టి తాళం వేశారు. కొందరు బంధు జనం కుల బహిష్కరణ చేస్తారనే భయంతో రాలేకపోయారు. ద్వేషంతో ఆ పెళ్లికి వెళ్లిన వారికి ఇంట్లో అడుగు పెట్టవద్దని బెదిరించారు. ఆ బెదిరింపుల కారణంచేత చాలామంది రావాలనుకున్నా రాలేకపోయార ధైర్యం గలవారు మాత్రమే వచ్చి వివాహ మహోత్సవం అంతా చూశారు. వారు పెళ్లి తాంబూలాలే గాక వివాహ భోజనాలు కూడా చేసారు. వీరేశలింగం గారు 1885లో చెన్నై వెళ్లారు.అక్కడ తన ఉపన్యాసంలో రాజమండ్రి స్త్రీ పునర్వివాహ చరిత్రను గురించి చెప్పారు. తనకు మొదటి నుండి వెన్నుదన్నుగా నిలిచిన....ఈ వివాహం నందే గాకదేశ సంక్షేమ కార్యక్రమాలలోను మరియు ప్రయోజితకార్యక్రమలలోను కుడి భుజము గా నిలిచన బసవరాజు గవర్రాజు గురించి చెప్పారు.ఆ వివాహం రోజున వారింట పరమ పదించినట్లుగొల్లుమన్నారు. తనవైపు బంధువులు, తన భార్యవైపు బంధువులు గొల్లుమంటు లేచి వెళ్లి పోయారు.తన్ను పెంచి పెద్ద చేసిన తల్లి ఆయనను వదిలివెళ్లి పోయింది. చాలా కాలంగా మంచమెక్కినభార్య సేవకు బంధువులు రాక పోవడంతో కలిగినఇబ్బందులు చెప్పుతరం కాదు. ప్రాయశ్చిత్తం పేరతలపెట్టక, పరోపకార నిమిత్తం ఎన్నో కష్టాలుసంతోషంగా భరిస్తున్న గవర్రాజుగారినీ ఎలా అభి నందించాలో అర్థం కావడం లేదన్నారు.మొదటి స్త్రీ పునర్వివాహం 4రోజుల పాటువైభవంగజరిగిందని తెలియజేసారు. (ఇంకా ఉంది)- ఇది 95వ భాగం - బెహరా ఉమామహేశ్వరరావు- 9290061336
August 17, 2020 • T. VEDANTA SURY • Serial