ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కడుపులో నొప్పి- నివారణ -- పి . కమలాకర్ రావు
October 31, 2020 • T. VEDANTA SURY • health tips
మనం తిన్న ఆహారం అరగ నప్పుడు లేదా పడని పదార్థం తిన్నప్పుడు కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కలబంద వేరును తెచ్చి బాగా కడిగి నల్ల గొట్టి రసం తీయాలి దీనిని కొద్దిగా వేడి చేసి అందులో పొంగించిన ఇంగువ పొడి కలిపి త్రాగాలి. కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది. కలబంద పక్కనున్న ముళ్ళని తీసివేసి గుజ్జును సేకరించి అందులో. కరక్కాయ పొడి సైంధవ లవ ణం కలిపి కొద్దిగా నెయ్యి వేసి బాగా గిలకొట్టి త్రాగించాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగించాలి కడుపులో ఎలాంటి సమస్య ఉన్నా తగ్గిపోతుంది. వామును నీటిలో వేసి మరిగించి అందులో కొద్దిగా నల్ల ఉప్పు కలిపి త్రాగిన కడుపు నొప్పి తగ్గిపోతుంది. ధనియాలను కషాయంగా కాచి అందులో కొద్దిగా సొంటి పొడి కలిపి త్రాగిన కూడా కడుపు నొప్పి తగ్గిపోతుంది.
 
 
 
 
ReplyForward